
మాస్ మహారాజా రవితేజ నటించిన 77వ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ (Irumudi) ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఇరుముడి పేరుతో వచ్చిన ఈ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది.
అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో అందమైన కుటుంబం, తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రతి ఒక్కరినీ హర్ట్ టచ్ చేసేలా ఉంది. గ్లింప్స్ చూస్తుంటే, సినిమాలో ఆధ్యాత్మికతతో కూడిన బలమైన కథ ఉండబోతోందని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇన్నాళ్లు ఐటెం సాంగ్స్, యాక్షన్ సీన్స్ అంటూ వస్తున్న రవితేజ, ఈసారి మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టులో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ ‘ఇరుముడి’ సినిమా మలయాళ హిట్ సినిమా ‘మాలికాపురం’ రీమేక్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఈ ప్రచారాన్ని ‘ఇరుముడి’ సినిమా మేకర్స్ ఖండించలేదు. రీమేక్ అని కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పటికి అయితే ప్రస్తుతానికి ఇది పుకారు మాత్రమే.
Presenting the talented @priya_Bshankar as ‘Kaveri’ from #IRUMUDI / #ఇరుముడి – a caring wife and a doting mother ❤️
Starring MASS MAHARAJA @RaviTeja_offl 🤩
A @gvprakash musical 🎺🎼@ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/e9puiTkwrS
— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2026