Reading Time: < 1 minute
Peddi Core Plot Revealed The Railway Track Connection In Ram Charans Movie

అసలు పెద్ది కథేంటి? అది తెలియాలంటే జూన్ 4న సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ముందు నుంచి దర్శకుడు బుచ్చిబాబు పెద్ది కథ పై ఒక హింట్ ఇస్తు వస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మల్టీస్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. క్రికెట్, కుస్తి, రన్నింగ్ లాంటి ఆటలు సినిమాలో కీలకంగా ఉండనున్నాయి. రామ్ చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడు. దీంతో.. ఇది మల్టీస్టోర్ట్స్ యాక్షన్ డ్రామా అని అంతా ఫిక్స్ అయిపోయారు. అలాగే.. ఊరికోసం పెద్ది చేసే పోరాటమే అసలు కథ అని టాక్ ఉంది. అయితే పెద్ది కోర్ పాయింట్ మాత్రం వేరే ఉందని లేటెస్ట్ పోస్టర్‌తో మరోసారి సాలిడ్ హింట్ ఇచ్చేశాడు బుచ్చి.

సరిగ్గా గమనిస్తే.. మొదటి నుంచి పెద్ది ప్రమోషనల్ కంటెంట్‌లో రైల్వే ట్రాక్‌ను హైలెట్ చేస్తు వస్తున్నారు. చికిరి సాంగ్‌లో, ట్రైలర్‌లోను ఇది క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ అయితే.. రైల్వే ట్రాక్‌ను మరింత హైలెట్ చేస్తు ఉంది. ట్రాక్‌తో పాటు బ్లడ్ బాత్ అనేలా ఉన్నాడు రామ్ చరణ్. ఈ లెక్కన చూస్తే.. పెద్ది కథను సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పెయొచ్చు. తన ఊరికి రైల్వే ట్రాక్‌ను తీసుకురావడమే పెద్ది లక్ష్యంగా కనిపిస్తోంది. దానికోసం పెద్ది ఆడిన ఆటలు, పోరాటం సినిమాకే హైలెట్‌గా ఉండనున్నాయి. అలాగే ఎమోషనల్ పరంగా సినిమా పీక్స్‌లో ఉంటుందని ముఖ్యంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌తో పెద్ది క్లైమాక్స్‌ సినిమాకు ప్రాణం పోసేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మొత్తంగా పెద్దిగాడు తన ఊరికోసం ఆడబోయే ఆట ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ ఇస్తుందని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.