
మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణం. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్ హైప్ క్రియేట్ చేయగా.. ఇక తాజాగా విడుదలైన రామాయణం సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ డ్రామాలో రణబీర్ కపూర్ (రాముడు), యష్ (రావణుడు) , సాయి పల్లవి (సీత) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత మిగతా నటీనటులు ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో స్పెష్ హైలెట్ అవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ లో సాయి పల్లవి వెనక కనిపించిన అమ్మాయి ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. దీంతో ఆ అమ్మడు గురించి తెలుసుకోవాలని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ అమ్మాయి పేరు సురభి దాస్. ఈ చిత్రంలో తాను సీత చెల్లెలు శ్రుతకీర్తి పాత్రలో నటిస్తున్నట్లు గతంలోనే ఆమె అధికారికంగా వెల్లడించారు. తాను ఊర్మిళ పాత్ర చేయడం లేదని, శ్రుతకీర్తి (సీత అతి చిన్న చెల్లెలు, శతఘ్నుడి భార్య) పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టం చేశారు. తన కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్ అని, ఈ చిత్రంలో భాగం కావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చబ్రా ద్వారా ఆడిషన్స్ ఇచ్చి ఈ ఛాన్స్ దక్కించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ముంబైకి వచ్చాక బుల్లితెరపై కొన్ని షోలు చేసిన తనకు, ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ మంచి గుర్తింపు తెస్తుందన్న నమ్మకంగా ఉందన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఫైట్ అంటే నిప్పులా ఉంటారు.. అలాంటి హీరోను జీవితంలో చూడలేదు.. టాలీవుడ్ నటుడు..
సురభీ దాస్ విషయానికి వస్తే.. ఆమె అస్సామీ చిత్ర పరిశ్రమతో పాటు హిందీ బుల్లితెర, బాలీవుడ్ సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నీమా డెంజోంగ్పా అనే సీరియల్ ద్వారా హిందీ బుల్లితెరకు కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రముఖ స్టార్ ప్లస్ సీరియల్ ‘పాండ్యా స్టోర్’ లో కూడా కీలక పాత్రలో నటించి హిందీ ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు రామాయణ చిత్రంలో శ్రుతకీర్తి పాత్రలో కనిపించనున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema: ఇదెక్కడి సస్పెన్స్ రా బాబూ.. 2 గంటలు చెమటలు పట్టించే థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దుమ్మురే
సురభి దాస్ పోస్ట్..
ఎక్కువ మంది చదివినవి : Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్..