Reading Time: < 1 minute

Commonwealth Games: చరిత్ర సృష్టించిన అస్మిత డే.. జూడోలో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్

Caption of Image.

ఇండియా జూడో ప్లేయర్ అస్మితా డే చరిత్ర సృష్టించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో జూడోలో ఇండియా తరపున తొలి స్వర్ణం సాధించిన ప్లేయర్ గా చరిత్రకెక్కారు. 

శుక్రవారం (జులై 31) జరిగిన 48 కేజీ విభాగం ఫైనల్ మ్యాచ్ లో కెనడా ప్లేయర్ హెయిదీ క్వాచ్ ను 2-1 తేడాతో ఓడించారు. నిర్ణీత సమయం ముగిసేసరికి మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఆ  తర్వాత, గోల్డెన్ స్కోర్ పీరియడ్‌లోకి ప్రవేశించేటప్పుడు అస్మిత లెగ్ టాంగిల్‌తో నిర్ణయాత్మక యూకోను సాధించి  అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 

 అస్మితా డే, 2003 మార్చి 22న దక్షిణ త్రిపురలోని జిల్లా కేంద్రమైన బెలోనియాలో జన్మించారు. సైకిల్ రిపేర్ షాపు యజమాని కుమార్తె స్థాయి నుంచి ఇండియా మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ జూడో ఛాంపియన్‌గా ఎదిగే వరకు ఆమె స్టోరీ ఆదర్శనీయం అనే చెప్పాలి. ఈ 23 ఏళ్ల క్రీడాకారిణి  పట్టుదల, క్రమశిక్షణ , క్రీడా రంగంలో కన్సిస్టెంట్ గా ముందుకు సాగడంతో ఆమెకు గోల్డ్ సాధ్యమైంది.  సాధారణ నేపథ్యం నుండి వచ్చిన అస్మిత చిన్నతనం నుంచి పోటీ క్రీడలతో పెద్దగా పరిచయం లేని వాతావరణంలో పెరిగి ఇండియా గర్వించే స్థాయికి ఎదిగారు. 

హర్ష్ సింగ్ కు స్వర్ణం:

ఇవాళ కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా 30 నిమిషాల వ్యవధిలోనే రెండు బంగారు పతకాలు సాధించడం విశేషం. అస్మిత దే గోల్డ్ సాధించిన వెంటనే హర్ష్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోషువా కట్జ్ పై గెలిచి స్వర్ణం సాధించాడు. 

 మ్యాచ్ లో సరైన సమయం కోసం వేచి చూసిన హర్ష్..  చివర్లో నిమిషం కంటే తక్కువ సమయం మిగిలి ఉండగా,  కీలక పాయింట్లను సాధించాడు. హర్ష్ సింగ్ పురుషుల 60 కేజీల విభాగంలో గోల్డ్ సాధించాడు.

అస్మితా దే, హర్ష్ సింగ్ గోల్డ్ మెడల్స్ తో.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు నాలుగు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు (సిల్వర్), ఐదు కాంస్య (బ్రాంజ్) పతకాలతో ఇండియా పతకాల సంఖ్య 18కి పెరిగింది.

©️ VIL Media Pvt Ltd.