Reading Time: 2 minutes

Pawan Kalyan: నాని సినిమాకు బ్రేక్.. పవన్ కళ్యాణ్ ‘OG 2’ వేట మొదలుపెట్టిన సుజీత్!

Caption of Image.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ ‘OG’ (They Call Him OG) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ మేకింగ్, గన్‌షాట్ యాక్షన్, గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్లతో పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన యంగ్ సెన్సేషన్ సుజీత్, ఇప్పుడు అంతకు మించిన ఒక క్రేజీ అప్‌డేట్‌తో టాలీవుడ్‌ను షేక్ చేయడానికి రెడీ అయిపోయారు. అదే… ‘OG 2’ (ఓజీ సీక్వెల్). 

‘OG 2’ వేట మొదలు!

నిజానికి సుజీత్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో ‘బ్లడీ రోమియో’ పేరుతో అనౌన్స్ చేశారు. అయితే, నాని ప్రస్తుతం నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం షూటింగ్ వాయిదాల వల్ల మరింత ఆలస్యం కానుంది. నాని డేట్స్ అడ్జస్ట్ కావడానికి కనీసం మరో ఆరు నెలల సమయం పట్టేలా ఉండటంతో, సుజీత్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తన ఫోకస్‌ను పూర్తిగా ‘OG 2’ వైపు మళ్లించారు. నాని అందుబాటులోకి వచ్చేలోపే పవర్ స్టార్ కోసం పవర్‌ఫుల్ సీక్వెల్ స్క్రిప్ట్‌ను పక్కాగా లాక్ చేయాలని సుజీత్ రంగంలోకి దిగారు. గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.

ఊహించని రేంజ్‌లో యాకూజా కనెక్షన్!

తొలి భాగంలో జపాన్ బ్యాక్‌డ్రాప్, యాకూజా గ్యాంగ్స్ ప్రస్తావన తెచ్చి సుజీత్ పెట్టిన లీకులు గుర్తున్నాయిగా? ఇప్పుడు పార్ట్-2 లో ఆ వైల్డ్ అండ్ వయోలెంట్ ప్రపంచాన్ని మరింత డీప్‌గా చూపించబోతున్నారు.  అంతే కాదు ఈ సీక్వెల్‌లో కొన్ని సరికొత్త, మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్లను యాడ్ చేయబోతున్నారు. ఇవి కథను మరింత రసవత్తరంగా మార్చనున్నాయి.  పవన్ కళ్యాణ్ కోసం మరింత ఇంటెన్స్, వైల్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లను సుజీత్ డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది..

ఒకవైపు నాని కోసం ‘బ్లడీ రోమియో’ ప్రపంచాన్ని సిద్ధం చేస్తూనే, మరోవైపు పవన్ కళ్యాణ్ ‘OG 2’ కోసం సుజీత్ చేస్తున్న ఈ డబుల్ ప్లానింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్లలో మరోసారి హంగ్రీ చీతా వేట మొదలుకావడం ఖాయం అనిపిస్తోంది. ఈ పవన్- సుజీత్ సినిమా ఎప్పుడు పట్టాలపైకి వస్తుందో చూడాలి మరి.

 

©️ VIL Media Pvt Ltd.