Reading Time: < 1 minute
Vijay Letter To Governor Claims Support Of 121 Mlas Tamil Nadu Government Formation

తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. గత 5 రోజులుగా మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో విజయ్ ప్రమాణస్వీకారాన్ని గవర్నర్ అర్లేకర్ నిలిపేశారు. తాజాగా వామపక్షాలు, వీసీకే పార్టీల మద్దతుతో బలం 118కు చేరింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

అయితే తాజాగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు విజయ్ సంచలన లేఖ రాశారు. తమ దగ్గర 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖ రాశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లోక్‌భవన్‌లో కలవబోతున్నట్లుగా లేఖలో విజయ్ పేర్కొన్నారు. ఇక గవర్నర్‌ను కలిసిన అనంతరం సీపీఐ, వీసీకే నాయకులను కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా 121 ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు విజయ్ లేఖ రాయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వామపక్షాలు, వీసీకే కాకుండా ఇంకెవరూ మద్దతు ఇచ్చారని చర్చ నడుస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేల నుంచి ఇంకెవరైనా మద్దతు ఇచ్చారా? అన్న చర్చ నడుస్తోంది. ఈ ఉత్కంఠ మరికొన్ని నిమిషాల్లో వీడిపోనుంది.