July 12, 2026

Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..

Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..
Reading Time: < 1 minute
Suvendu Adhikari Selected First Bjp Chief Minister Of West Bengal

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఖరారయ్యారు. శుక్రవారం కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సువేందు అధికారిని అత్యున్నత పదవి కోసం ఎన్నుకున్నారు. శనివారం మే 09న కోల్‌కతాలోని బ్రిగేర్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగబోతోంది. సీఎంతో పాటు మరో ఇద్దరు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారు.

సీఎంగా సువేందు పేరును బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రతిపాదించారు. దీంతో ఎమ్మెల్యేలంతా సువేందును తమ నేతగా ఎన్నుకున్నారు. రేపు జరుగబోతున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీసీఎంలు హాజరవుతారని తెలుస్తోంది. బెంగాల్‌లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టబోతున్న బీజేపీ సీఎంగా సువేందు రికార్డు క్రియేట్ చేయనున్నారు.

ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మాజీ సీఎం మమతా బెనర్జీని సువేందు అధికారి భవానీపూర్ నియోజకవర్గంలో ఓడించారు. 2021 ఎన్నికల్లో కూడా దీదీని నందిగ్రామ్‌లో ఓడించారు. బీజేపీ గెలుపుతో కీలక పాత్రను పోషించారు. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గానూ 207 స్థానాల్లో గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కేవలం 80 సీట్లకు పరిమితమై ఘోరపరాజయం పాలైంది.