July 11, 2026

RCB IPL 2026 Playoffs: ఆర్‌సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!

RCB IPL 2026 Playoffs: ఆర్‌సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
Reading Time: 2 minutes
Rcb Ipl 2026 Playoffs Scenario How Royal Challengers Bengaluru Can Finish In Top 2

RCB Top 2 Chances in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో వరుసగా రెండో ఓటమి ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ).. ప్లేఆఫ్స్ రేసులో కాస్త వెనకపడింది. కెప్టెన్ రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్‌సీబీ తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి.. టాప్-2లో నిలిచింది. అయితే ఇటీవల వరుస పరాజయాలతో బెంగళూరు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో మూడో స్థానంలో ఉంది. టాప్ 2లో ఉండాలంటే.. ఆర్‌సీబీ సమీకరణాలు ఎలా ఉంటాయో ఓసారి చూద్దాం.

నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే:
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీకి ఇంకా నాలుగు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో తలపడాల్సి ఉంది. ముఖ్యంగా టాప్‌లో ఉన్న పంజాబ్, హైదరాబాద్‌లపై ఫలితాలు ఆర్‌సీబీ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఆర్‌సీబీ మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే 20 పాయింట్లతో లీగ్ దశ ముగిస్తుంది. 10 జట్ల ఫార్మాట్‌లో 20 పాయింట్లు సాధించిన జట్టు దాదాపు టాప్-2లో నిలుస్తుంది. దీంతో క్వాలిఫయర్-1 ఆడే అవకాశం ఆర్‌సీబీకి లభిస్తుంది.

మూడు మ్యాచ్‌లు గెలిస్తే:
నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిస్తే ఆర్‌సీబీ 18 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తుంది. ప్రస్తుతం జట్టు నెట్ రన్‌రేట్ +1.234గా ఉండటం పెద్ద ప్లస్‌గా మారింది. అదే పాయింట్లతో ఇతర జట్లు లీగ్ దశను ముగించినా.. ఆర్‌సీబీకి మెరుగైన నెట్ రన్‌రేట్ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ లేదా పంజాబ్‌పై బెంగళూరు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.

రెండు మ్యాచ్‌లు గెలిస్తే:
ఆర్‌సీబీ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిస్తే.. 16 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిలో టాప్-2 అవకాశాలు పూర్తిగా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడతాయి. హైదరాబాద్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు ఓడిపోవాలి. అలాగే పంజాబ్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోవాల్సి ఉంటుంది. అదనంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు.

ఈ పరిస్థితుల్లో ఆర్‌సీబీ తదుపరి ఆడే రెండు మ్యాచ్‌లు ‘డూ ఆర్ డై’గా మారాయి. మరో ఓటమి ఎదురైతే.. టాప్-2 ఆశలు దాదాపు కష్టమవుతాయి. పాయింట్ల పట్టికలో మూడో లేదా నాలుగో స్థానానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అభిమానులు ఆశించినట్లుగా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌లో బలంగా నిలవాలంటే.. ఇక ప్రతి మ్యాచ్ ఫైనల్‌లా ఆడాల్సిందే. క్వాలిఫయర్-1 ఆడే అవకాశం కోసం ఆర్‌సీబీ గట్టిగా ప్రయత్నిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.