Reading Time: < 1 minute

నాకు చెప్పే… నన్ను తొలగించారు: నాకెలాంటి బాధ లేదంటూ వర్మ ఎమోషనల్…

Caption of Image.

టీడీపీ నేత వర్మను పిఠాపురం ఇంచార్జి పదవి నుంచి తొలగించింది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో గురువారం ( మే 7 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు వర్మ. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పిఠాపురంలో నూతన కమిటీ ఏర్పాటు చేసే క్రమంలో వర్మను ఇంచార్జి పదవి నుంచి తొలగించింది అధిష్టానం. ఈ క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తానని అంటూనే భావోద్వేగానికి లోనయ్యారు వర్మ.

2024 ఎన్నికల సమయంలో పొత్తు కారణంగా తన స్థానాన్ని త్యాగం చేశానని.. పొత్తు వాళ్ళ ఎవరో ఒకరు నష్టపోక తప్పదని అన్నారు. తనతో చర్చించాకే అధిష్టానం నిర్ణయం తీసుకుందని… అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తూ పిఠాపురం ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు వర్మ.

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు వర్మ. తానేంటో అధిష్టానానికి, పిఠాపురం ప్రజలందరికీ తెలుసనీ.. ఎన్నికల సమయంలో పార్టీ కోసం నిలబడమంటే నిలబడ్డానని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని ఈనాడు వ్యతిరేకించలేదని అన్నారు వర్మ. మీడియా సమావేశం మధ్యలో నుండే వెళ్లిపోయారు వర్మ. 

©️ VIL Media Pvt Ltd.