Reading Time: 2 minutes
Trisha: విజయ్ కారణంగా ఆ హీరోయిన్‏తో గొడవ.. అసలు విషయం చెప్పిన త్రిష..

త్రిష కృష్ణన్.. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈరోజు ఆమె 44వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు త్రిషకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మలయాం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె ప్రస్తుతం సూర్యతో కలిసి ‘కరుప్పు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆమె దాదాపు 20 సంవత్సరాలుగా కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓవైపు నటనతో అలరించి స్టార్ డమ్ సంపాదించుకున్నప్పటికీ సంవత్సరాలుగా త్రిష గురించి ఏదోక రూమర్ నెట్టింట వైరలవుతుంటుంది. ఇటీవలే హీరో విజయ్ దళపతితో స్నేహంపై రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. కానీ సంవత్సరాలుగా ఓ హీరోయిన్ తో ఆమెకు గొడవ ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆసిన్. నిజమే.. వీరిద్దరి మధ్య విజయ్ కారణంగా మనస్పర్థలు వచ్చాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

హీరోయిన్స్ త్రిష, ఆసిన్ మధ్య చాలా కాలంగా మనస్పర్థలు ఉన్నాయని టాక్. ఇందుకు కారణం విజయ్ దళపతి అని అంటుంటారు. అయితే ఈ విషయంపై గతంలోనే త్రిష స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆసిన్ తో మనస్పర్థల గురించి ప్రశ్న ఎదురు కావడంతో త్రిష స్పష్టత ఇచ్చారు. అందులో త్రిష మాట్లాడుతూ.. “నాకు, నటి అసిన్‌కు మధ్య విభేదాలు ఉన్నాయన్నది పూర్తిగా వదంతులే. నటి అసిన్‌తోనే కాదు, నాకు మరే ఇతర నటితోనూ ఎప్పుడూ విభేదాలు లేవు. నేను ‘వర్షం’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నాను. ఆ కార్యక్రమంలోనే నేను అసిన్‌ను కలిశాను. అప్పుడు ఆమె నన్ను అభినందించారు. నాకు, ఆమెకు మధ్య ఎప్పుడూ గొడవ జరగలేదు,” అని అన్నారు. ప్రస్తుతం ఈ సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

త్రిష, అసిన్ ఇద్దరూ ఒకే సమయంలో హీరోయిన్లుగా అరంగేట్రం చేశారు. ఇద్దరూ పెద్ద చిత్రాలలో నటించారు. వారు చాలా మంది అగ్ర నటులతో కూడా నటించారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆసిన్ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. మరోవైపు త్రిష మాత్రం ఇప్పటికీ కథానాయికగానే దూసుకుపోతుంది. త్రిష ‘తిరుపాచి’ చిత్రంలో విజయ్ సరసన నటించింది. అసిన్ ‘శివకాశి’లో విజయ్ సరసన కూడా నటించింది.

Trisha, Asin

Trisha, Asin

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

త్రిష ఇన్ స్టా పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan)

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..