Reading Time: < 1 minute
Nbk 111 Update Kajal Aggarwal Likely To Pair With Balakrishna Not Nayanthara

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 111వ సినిమా చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెరపడింది.

ప్రారంభంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం బాలయ్య సరసన స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ నటించడం దాదాపు ఖాయమైంది. ‘భగవంత్ కేసరి’ చిత్రంలో బాలకృష్ణతో కలిసి నటించిన కాజల్.. మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉండటంతో మేకర్స్ కాజల్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

కాజల్ త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లోకి అడుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. మే నెల మొత్తం ఆమె డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఆమె పాత్రపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని తన సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే కాకుండా.. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో చూపిస్తుంటారు. మరి ‘NBK 111’లో కాజల్ పాత్రను ఆయన ఎలా తీర్చిదిదుతున్నారో చూడాలి.