Reading Time: < 1 minute

ఖరీఫ్ సీజన్‌‌‌‌ కు సరిపడా ఎరువులున్నయ్… రైతులకు కేంద్ర ప్రభుత్వం భరోసా

Caption of Image.

న్యూఢిల్లీ: దేశంలో 2026 ఖరీఫ్ సీజన్‌‌‌‌కు సరిపడా ఎరువులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 ఖరీఫ్ సీజన్ అవసరాలకు మించి సరఫరా కొనసాగుతున్నందున, దేశంలో ఎరువుల లభ్యత సరిపోతుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఇంటర్​మినిస్టీరియల్ సమావేశంలో ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా శర్మ ఈ వివరాలు వెల్లడించారు.

ప్రస్తుతానికి దేశీయ ఎరువుల ఉత్పత్తి 62.37 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని, దిగుమతులు సుమారు 15.39 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నాయని.. దీంతో ప్రస్తుత కాలంలో మొత్తం లభ్యత సుమారు 78 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని ఆమె తెలిపారు. 38 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 19 లక్షల మెట్రిక్ టన్నుల ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులను సేకరించేందుకు గ్లోబల్ టెండర్లను పిలిచినట్టు ఆమె తెలిపారు. 

అలాగే దేశవ్యాప్తంగా ఎల్‌‌‌‌పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేవని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.