
ఈ డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్ మన శరీరంలో ఒక భాగమైపోయింది. ఒక్క నిమిషం ఫోన్ కనిపించకపోయినా, ఒక్క క్షణం నెట్ రాకపోయినా అల్లాడిపోతుంటాం. అయితే అత్యవసరంగా ఎవరికైనా పేమెంట్ చేయాలన్నా లేదా ముఖ్యమైన మెసేజ్ పంపాలన్నా సరిగ్గా అదే సమయంలో ఫోన్ హ్యాంగ్ అయితే వచ్చే కోపం అంతా ఇంతా కాదు. చాలామంది ఫోన్ పాతబడటం వల్లే ఇలా జరుగుతుందని భావిస్తారు. కానీ అసలు కారణం ఫోన్ సాఫ్ట్‌వేర్‌పై మనం పెంచే భారమే. రూపాయి ఖర్చు లేకుండా మీ ఫోన్‌ను కొత్తదానిలా మార్చే ఆ 4 మ్యాజిక్ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కాష్ డేటా క్లీన్ చేయండి
మనం యాప్స్ వాడుతున్న కొద్దీ ఫోన్ మెమరీలో కాష్ డేటా అనే అనవసరమైన ఫైల్స్ పేరుకుపోతాయి. ఇవి మీ ఫోన్ ప్రాసెసర్‌ను నెమ్మదింపజేస్తాయి. ఫోన్ సెట్టింగ్స్‌లోని యాప్స్ విభాగానికి వెళ్లండి. మీరు ఎక్కువగా వాడే యాప్స్ సెలెక్ట్ చేసి క్లియర్ కాష్ నొక్కండి. అయితే జాగ్రత్త.. క్లియర్ డేటా నొక్కితే మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం కాష్ మాత్రమే క్లియర్ చేయండి.
బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌కు బ్రేక్ వేయండి
మనం ఒక యాప్ వాడి క్లోజ్ చేసినా, అది తెర వెనుక రన్ అవుతూనే ఉంటుంది. ఇది మీ ర్యామ్, బ్యాటరీని నిశ్శబ్దంగా తినేస్తుంది. దీనివల్ల ఫోన్ వేడెక్కుతుంది. బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అనవసరంగా రన్ అవుతున్న యాప్‌లను ఫోర్స్ స్టాప్ చేయండి. దీనివల్ల ప్రాసెసర్‌పై భారం తగ్గి ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది.
స్టోరేజ్ లెక్కలు చూసుకోండి
ఫోన్ మెమరీ 80 శాతం కంటే ఎక్కువ నిండితే, సిస్టమ్ ఆపరేటింగ్ వేగం తగ్గిపోతుంది. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చే పనికిరాని వీడియోలు, డూప్లికేట్ ఫోటోలు ఫోన్‌కు శత్రువుల వంటివి. వారానికి ఒకసారి ఫోన్ గ్యాలరీని శుభ్రం చేయండి. నెలల తరబడి వాడకుండా ఫోన్‌లో మూలన పడి ఉన్న యాప్‌లను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. మెమరీ ఖాళీగా ఉంటే ఫోన్ వేగం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.
ఆటో అప్‌డేట్స్‌ను ఆఫ్ చేయండి
ప్లే స్టోర్‌లో ఆటో-అప్‌డేట్ ఎనేబుల్ అయి ఉంటే, మీకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ అప్‌డేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫోన్ అకస్మాత్తుగా నెమ్మదిస్తుంది.
గూగుల్ ప్లే స్టోర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ ప్రిఫరెన్సెస్‌లో ఆటో అప్‌డేట్‌ను ఆఫ్ చేయండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు, అవసరమైన యాప్స్‌ను మాత్రమే మాన్యువల్‌గా అప్‌డేట్ చేసుకోండి.
కొత్త ఫోన్ కొనడం ఒక్కటే పరిష్కారం కాదు, ఉన్న ఫోన్‌ను తెలివిగా వాడుకోవడం ముఖ్యం. పైన చెప్పిన ఈ చిన్న మార్పులు మీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని రెట్టింపు చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మీ ఫోన్ సెట్టింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి..