Reading Time: < 1 minute
Shakti App: అర్ధరాత్రి వేళ.. యువతిని కాపాడిన శక్తి యాప్‌

అర్ధరాత్రి వేళ ఓ యువతికి ఎదురైన ఆపదను ఆంధ్రప్రదేశ్ పోలీసుల ‘శక్తి’ యాప్ సమర్థవంతంగా అడ్డుకుంది. బెంగళూరులో ఉద్యోగం చేసే యువతి, రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 12.30 గంటలకు విజయవాడ బస్టాండ్ చేరుకుంది. నంబూరు వెళ్లేందుకు ఆటో ఎక్కుతూ, ముందు జాగ్రత్తగా ఆటో నంబర్‌ను ఫోటో తీసి ‘శక్తి’ యాప్‌లో అప్‌లోడ్ చేసింది. ప్రయాణంలో ఆటో డ్రైవర్ ఫణీంద్ర యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె యాప్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ వచ్చింది. కొద్దిసేపటికే కాజా టోల్ ప్లాజా వద్దకు రాగానే, ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి నిందితుడు ప్రయత్నించాడు. అయితే, యాప్ ద్వారా ఆటో కదలికలను ట్రాక్ చేసిన మంగళగిరి ఎస్సై వెంకట్, వేగంగా స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువతిని సురక్షితంగా కాపాడారు. నిందితుడు ఫణీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళల భద్రతకు ‘శక్తి’ యాప్ ఎంతటి భరోసా ఇస్తుందో ఈ ఘటన నిరూపించింది. ఒంటరిగా బయటకు వెళ్లే ప్రతి మహిళా తమ మొబైల్‌లో ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ సూచించారు. సకాలంలో యాప్ వాడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పులిగుండాల అడవుల్లో చిరుతలు.. ట్రాప్ కెమెరాలో అరుదైన దృశ్యాలు

Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా రూ.459 సరికొత్త ప్లాన్‌..!

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు

ఏడు కొండలపై టెక్నాలజీ విప్లవం.. ఆ 7 అద్భుతాలు ఏంటి ??

ఆ చిన్న మార్పు చేసుంటే.. ఉస్తాద్ ఇంకా బాగా ఆడేది