
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గజైనేషన్(EPFO) తన ఖాతాదారులకు డిజిటల్ సేవలను అందిస్తోంది. ఈపీఎఫ్‌వో కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఏ పనైనా ఆన్‌లైన్ ద్వారా సులువుగా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. అందులో భాగంగా కేవైసీ ప్రాసెస్ సింపుల్‌గా చందాదారులు చేసుకునే సౌలభ్యం అందుబాటులో ఉంది. పీఎఫ్ ఖాతా వివరాలు, ఉద్యోగి వివరాల ధృవీకరణ కోసం కేవైసీ అనేది ఉపయోగపడుతుంది. మీరు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్, పీఎఫ్ విత్ డ్రా లాంటి సేవలను పొందలేరు. అందుకే కేవైసీ అనేది అత్యంత ముఖ్యమైనది. ఆన్‌లైన్ ద్వారా సులువుగా ఎలా కేవైసీ చేసుకోవాలి? అనేది ఇప్పుడు చూద్దాం.
పోర్టల్ ద్వారా ఇలా..
-https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
-యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి
-మేనేజ్ సెక్షన్‌లోకి వెళ్లండి
-మాడిఫై బేసిక్ డీటెయిల్స్‌పై క్లిక్ చేయండి
-మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటి వివరాలు ఎంటర్ చేయండి
-యూఐడీఏఐ డేటాతో సిస్టమ్ మీ వివరాలను ఆటో వెరిఫై చేస్తుంది
-అన్ని వివరాలు ఎంటర్ చేశాక అప్డేట్ డీటైల్స్‌పై క్లిక్ చేయండి
-పెండింగ్ ఫర్ ఎంప్లాయర్ అప్రూవర్ అనే స్టేటస్ కనిపిస్తుంది
-కంపెనీ హెచ్‌ఆర్ ఆమోదించాక మీ కేవైసీ ప్రాసెస్ అవుతుంది
అనుమతి అవసరం లేదు
అయితే కేవైసీ సెక్షన్‌లో కొన్ని వివరాలు అప్డేట్ అవ్వడానికి మాత్రమే ఎంప్లాయర్ అనుమతి అవసరం. బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ఎలాంటి అనుమతి అవసరం ఉండదు. మీ ఈపీఎఫ్‌వో ఖాతాలో ఆధార్, పాన్ కార్డ్ వివరాలు లింక్ అయి ఉంటే బ్యాంక్ అకౌంట్ అప్డేట్ కోసం ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్లి సులువుగా బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చుకోవచ్చు. ఇందుకోసం ఎంప్లాయర్ ఆమోదం అవసరం లేదుు. బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ అప్డేట్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, పాన్ కార్డు వివరాలు అప్డేట్‌కు మాత్రం ఖచ్చితంగా ఎంప్లాయర్ అనుమతి ఉండాలి. అయితే పీఎఫ్ ఖాతాతో ఆధార్, పాన్ లింక్ అయి ఉండాలి. అప్పుడు మీరు సులభతరంగా పీఎఫ్ ఖాతాను నిర్వహించుకోవచ్చు. పీఎఫ్ నగదు విత్ డ్రా, పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ సమయంలో మీకు ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వవు. అందుకే ప్రతీఒక్కరూ తమ పీఎఫ్ ఖాతాతో ఆధార్, పాన్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్‌వో చెబుతోంది. లింక్ చేసుకోనివారు ఉంటే వెంటనే లింక్ చేసుకోవాలి.