Reading Time: 2 minutes
TATA: మీరు టాటా కారు వాడుతున్నారా? ఏప్రిల్ 28 లోపు ఈ 30 సర్వీసులు ఉచితం.. అదిరిపోయే డిస్కౌంట్లతో సమ్మర్ క్యాంప్!

TATA Motors: టాటా మోటార్స్ తన కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా ‘స్పెషల్ సమ్మర్ చెకప్ క్యాంప్’ నిర్వహిస్తోంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కార్ల పనితీరు తగ్గకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్యాంప్ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 28, 2026 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. మీ కారులోని సుమారు 30 రకాల కీలక భాగాలను నిపుణులు ఉచితంగా తనిఖీ చేస్తారు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఏమేమి తనిఖీ చేస్తారు?:

ఏసీ పనితీరు (AC Check), బ్యాటరీ హెల్త్, టైర్ల కండిషన్, వీల్ అలైన్‌మెంట్, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ స్థాయిలు, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మరియు సీఎన్జీ (CNG) సిస్టమ్ వంటి ముఖ్యమైన తనిఖీలు ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం ప్రత్యేక డయాగ్నోస్టిక్స్ సదుపాయం కూడా ఉంది.

భారీ తగ్గింపులు:

  • ఉచిత సర్వీసింగ్‌తో పాటు మరిన్ని ఆకర్షణీయమైన డిస్కౌంట్లను కూడా టాటా మోటార్స్ ప్రకటించింది.
  • విడి భాగాలు, లూబ్రికెంట్లు: 10 శాతం వరకు తగ్గింపు.
  • ఎక్స్‌టెండెడ్ వారంటీ: దీనిపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
  • యాక్సెసరీస్: టాటా జెన్యూన్ యాక్సెసరీలపై 15 శాతం వరకు భారీ తగ్గింపు.
  • ఈఎంఐ (EMI) సదుపాయం: వారంటీ ప్యాకేజీలు, ఏఎంసీ (AMC)లపై సులభమైన ఈఎంఐ ఎంపికలు కూడా ఉన్నాయి.

మరిన్ని వివరాల కోసం:

వినియోగదారులు తమ సమీపంలోని టాటా మోటార్స్ అధీకృత వర్క్ షాప్‌ను సందర్శించి ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా సందేహాలు ఉంటే:

  • టోల్ ఫ్రీ నంబర్: 1800 209 8282
  • ఈమెయిల్: Customercare@tatamotors.com

అయితే తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రయత్నంలో భాగంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఈ ఉచిత సదుపాయాన్ని తీసుకొచ్చింది. మీరు కూడా టాటా కారు వాడుతున్నట్లయితే ఈ ఉచిత చెకప్‌లను తప్పకుండా చేసుకోండి. అంతేకాదు. మీ కారులో ఏదైనా సమస్యలు ఆ విడి భాగాలపై కూడా మంచి డిస్కౌంట్‌ అందిస్తోంది. కారుకు ఉచిత చెకప్‌ సర్వీసులను అందుకోవడమే కాకుండా వివిధ రకాల విడిభాగాలను తక్కువ ఖర్చుతో వేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Baba Vanga: వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర భవిష్యవాణిలు నిజమైతే ఏమవుతుంది?

Gold, Silver Prices Crash: బంగారం, వెండి ప్రియులకు పండగే.. భారీ పతనం.. కేజీ వెండిపై లక్షన్నర తగ్గుదల!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి