కలలు కనడం సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే అక్షయ తృతీయ రోజు కొన్ని రకాల కలలు కనడం చాలా శుభప్రదం. కొన్ని రకాల కలలు రావడం వలన అవి అదృష్టాన్ని తీసుకొని రావడమే కాకుండా, జీవితంలో కొత్తదనానికి శ్రీకారం అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.
అక్షయ తృతీయ రోజు బంగారం కలలో కనిపించడం చాలా మంచిది. ఈరోజు ఎవరి కలలో అయితే బంగారం లేదా వెండి ఏదైనా కనిపిస్తుందో వారి పంట పండినట్లే, ఇలా కనిపిస్త సంపద పెరగడమే కాకుండా, ఏదో ఒక రూపంలో డబ్బు మీ చేతికి అందుతుందని అర్థం.
అదే విధంగా ఈ రోజు మీరు లక్ష్మీ పూజలో పాల్గొన్నట్లు, లక్ష్మీదేవి విగ్రహం లేదా లక్ష్మీదేవి కలలో కనిపించడం చాలా మంచిది. ఈ రోజు మీ కలలో లక్ష్మీదేవి కనిపిస్తే మీరు త్వరలో సంపన్నులు అవ్వడమే కాకుండా అదృష్టం రెట్టింపు అవుతుందనే అర్థం వస్తుందంట. ఇలా కనిపించడం చాలా మంచిది.
కుబేరుడు కలలో కనిపించినా మీకు అదృష్టం కలిసి వస్తుందంట. ఈరోజు ఎవరి కలలో అయితే కుబేరుడు కనిపిస్తాడో, వారి దశ తిరిగినట్లే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అదే విధంగా స్వచ్ఛమైన నీటిని చూడటం వలన కూడా అదృష్టం కలిసి వస్తుందంట.
అదేవిధంగా మీ కలలో పూలు, పండ్లు, సూర్య కాంతి , సూర్యుడు కనిపించినా చాలా మంచిదంట. దీని వలన కూడా మీకు అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




