
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జోరుగా సాగుతుంది. 140 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. కేరళ అంటేనే మళయాళం సినిమాలు.. మన అందరికీ సుపరిచితమైన హీరోలు.. హీరోయిన్స్.. రాష్ట్ర భవిష్యత్ ను డిసైడ్ చేసే ఈ ఎన్నికల్లో మళయాళం సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటోంది.
మళయాళం సూపర్ స్టార్ హీరోలు మోహన్ లాల్ ఉదయమే తన ఓటు వేశారు. కేరళం గో ఓట్ అనే క్యాప్షన్ తో.. వేలికి సిరా గుర్తు చూపిస్తూ ఫొటో పెట్టారు మోహన్ లాల్. అందరితోపాటు 20 నిమిషాలు క్యూలో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు మోహన్ లాల్.
కొచ్చిలోని ఓ పోలింగ్ బూత్ కు భార్యతో సహా వచ్చిన మమ్ముట్టి.. ఓటు వేసి వెళ్లారు.
మరో సూపర్ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారనర్ తేవరలోని ప్రభుత్వ స్కూల్ లోని పోలింగ్ బూతులో తన ఓటు వేశారు.
మళయాలి హీరోయిన్ అహనా, సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ ఇషాని కృష్ణ పోలింగ్ బూత్ దగ్గర ఓటు వేసిన ఫొటోలు ఫేర్ చేశారు.
మరో హీరో టివినో థామస్ కొచ్చిలోని ఇరింజలకుడ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.
మరో నటుడు అసిఫ్ అలీ తోడుపుజా ఏరియాలోని ఓ పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నాడు
మరో టాప్ హీరో, కేంద్ర మంత్రి సురేష్ గోపి.. గరువాయూర్ సిటీలోని ఓ పోలింగ్ బూతులో తన ఓటు వేశారు.
కేరళం రాష్ట్రంలో 2 కోట్ల 71 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 36 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.