Reading Time: < 1 minute

రోడ్లు మటాష్ ఆఫీసర్లు సైలెన్స్..చాలా చోట్ల గుంతలు, తవ్వకాలు

Caption of Image.
  • మెయిన్​ రోడ్ల నుంచి ఇంటర్నల్​రోడ్ల దాకా డ్యామేజీనే  
  • మూడు కార్పొరేషన్లలో ఇదే పరిస్థితి

హైదరాబాద్ సిటీ, వెలుగు:  మూడు కార్పొరేషన్ల పరిధిలో రోడ్లు అధ్వానంగా మారాయి. మెయిన్​రోడ్ల నుంచి మొదలుకుంటే ఇంటర్నల్​రోడ్ల వరకు అంతటా ఇదే పరిస్థితి. చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడగా, మరికొన్ని చోట్ల వాటర్​బోర్డు, ఎలక్ట్రిసిటీ, ప్రైవేట్​కేబుల్స్​కోసం, ఇంకొందరు ప్రైవేట్​వ్యక్తులు కూడా వాటర్​, సీవరేజీ కోసం తవ్వుతుండడంతో నాశనమవుతున్నాయి. కొన్ని శాఖలయితే, రోడ్డు తవ్విన తర్వాత మట్టి పోసి పోతుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వదిలేస్తున్నారు. మట్టి కారణంగా దుమ్ము లేస్తుండడంతో టూవీలర్లపై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు తవ్వే ముందు ఆయా కార్పొరేషన్ల నుంచి ఎన్​వోసీ తీసుకోవాలన్న నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. 

రాత్రికి రాత్రే.. 

మెయిన్​రోడ్ల నుంచి మొదలుకుంటే ఇంటర్నల్​రోడ్లను రాత్రికి రాత్రే తవ్వి పని పూర్తి చేసి వదిలేసి పోతున్నారు. స్థానిక అధికారులకు ఆమ్యమ్యాలు ముట్టజెప్పి..దర్జాగా అడ్డంగా బారికేడ్లు పెట్టి బాజాప్తా రోడ్ల కటింగ్​చేస్తున్నారు. దీంతో ఉదయం వేళ కొన్ని చోట్ల వాహనాల మూవ్​మెంట్​స్లో అయి ట్రాఫిక్​స్తంభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తవ్విన రోడ్లను గుర్తించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

సీఆర్ఎంపీ కింద అప్పగించట్లే… 

రోడ్ల నిర్వహణ ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉండడంతో.. ఎవరు పడితే వారు ఇష్టమున్నట్టు తవ్వుకుంటున్నారు.  దీంతో కొద్ది రోజుల కింద కాంప్రెన్సివ్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద మెయిన్​రోడ్ల నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. రూ.3,145 కోట్ల వ్యయంతో 1,014  కిలోమీటర్ల పొడువున రోడ్ల నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించేందుకు రెడీ అయ్యింది. 10 ఏండ్ల నిర్వహణ కోసం ఈ టెండర్లు వేస్తామని చెప్పంది.

 మూడు కార్పొరేషన్లు వేరయినప్పటికీ ఆ బాధ్యతలు మాత్రం జీహెచ్ఎంసీ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.  రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన తర్వాత రోడ్ల రీకార్పెటింగ్​, క్లీనింగ్, ఫుట్ పాత్  నిర్వహణ ఇలా అన్నీ ఏజెన్సీలే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ, టెండర్లు వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఆలస్యమవుతున్నది. ఎలాగూ ఏజెన్సీలకే ఇస్తారు కదా అని రోడ్ల రిపేర్ల విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు.

©️ VIL Media Pvt Ltd.