
హైదరాబాద్, వెలుగు: జస్టిస్ ఘోష్ కమిషన్ పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈనెల 22న తీర్పును వెలువరించనుంది. మార్చి 12న వాదనలను విన్న హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించాల్సి ఉంది. కానీ తీర్పు సిద్ధం కాకపోవవడంతో 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో జరిగిన అవకవకలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేశారు.
కమిషన్ సమర్పించిన నివేదికను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్ కే.జోషి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టి మార్చి 12న తీర్పు వాయిదా వేసింది.