Reading Time: < 1 minute

విమెన్స్‌ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్‌లో వైశాలి

Caption of Image.

పాఫోస్‌ (సైప్రస్‌): విమెన్స్‌ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో ఇండియా గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌. వైశాలి తన జోరును కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో వైశాలి 31 ఎత్తుల వద్ద దివ్య దేశ్‌ముఖ్‌పై నెగ్గింది. ఈ విజయంతో వైశాలి ఐదున్నర పాయింట్లతో చైనా గ్రాండ్‌ మాస్టర్‌ జిన్‌ జుతో కలిసి సంయుక్తంగా టాప్‌లో కొనసాగుతోంది. వైశాలి, అన్నా ముజిచుక్‌ చెరో ఐదు పాయింట్లతో ఉన్నారు. 

టోర్నీ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వైశాలి ఇప్పుడు తన ఫామ్‌ను కొనసాగిస్తుండటంతో ఫైనల్‌ రేసు ఆసక్తికరంగా మారింది. ఓపెన్‌ సెక్షన్‌లో ఇండియా గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద.. వీ యీ (చైనా) మధ్య జరిగిన గేమ్‌ 56 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. మిడిల్‌ గేమ్‌లో ప్రజ్ఞా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ ఎండ్‌ గేమ్‌లో ఆధిక్యాన్ని చేజార్చుకున్నాడు. మథియాస్‌  బ్లూబామ్‌తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్న సిందరోవ్‌ ఏడు పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. 

 

©️ VIL Media Pvt Ltd.