July 12, 2026

Kavitha : మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తా.. డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం..

Kavitha : మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తా.. డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం..
Reading Time: 2 minutes
Kavitha New Political Party Announcement Telangana

Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత, తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ అజెండాపై ప్రస్తుతం లోతైన కసరత్తు జరుగుతోందని కవిత వెల్లడించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని తాను లోతుగా అధ్యయనం చేస్తున్నానని, అదే అజెండాతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మంచి ముహూర్తం చూసుకుని పార్టీ పేరును, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని ఆమె తెలిపారు. ఇప్పటికే పార్టీ పేరు విషయంలో అన్నీ సెట్ అవుతున్నాయని, కార్యాలయం కోసం స్థలాన్ని కూడా అన్వేషిస్తున్నామని ఆమె వివరించారు.

Panchanga Sravanam: సీఎం రేవంత్‌రెడ్డికి పాలన పరంగా ఇబ్బందులు లేవు.. గాంధీ భవన్ పంచాంగ శ్రవణం

తన రాజకీయ పోరాటం ఎవరితో ఉండబోతోందో కవిత సూటిగా చెప్పారు. డాడీ, మోడీ, చిన్న మోడీ పైనే తన పోరాటం ఉంటుందని ఆమె ప్రకటించారు. తనకు ఎవరితోనూ రాజీ లేదని, తన కొత్త పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ , సీఎం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని కవిత ఆరోపించారు. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

Nitish Kumar: బీహార్ కొత్త ముఖ్యమంత్రి పేరుపై నితీష్ కుమార్ సంకేతాలు!.. భగ్గుమంటున్న జేడీయూ నేతలు!

శ్రీరామనవమి తర్వాత పార్టీ ప్రకటన ఉంటుందని, అంతకంటే ముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తానని కవిత తెలిపారు. చాలా మంది జాతీయ నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతు కూడగడతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన యువతకు తన పార్టీలో పెద్దపీట వేస్తానని ప్రకటించారు. తనకు ఎలాంటి బేషజాలు లేవని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నూతన పార్టీ ప్రభావం ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని ఆమె విశ్లేషించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా చాలా చోట్ల నుంచి తనను పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని, రీసెంట్ గా వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరారని ఆమె వెల్లడించారు.