Reading Time: < 1 minute

‘విసా: వింటారా సరదాగా’ నుంచి అనగా అనగా అమెరికా సాంగ్ రిలీజ్

Caption of Image.

అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా కొత్త దర్శకుడు  ఉద్భవ్ రఘు రూపొందిస్తున్న చిత్రం ‘విసా: వింటారా సరదాగా’. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌తో  సినిమా నేపథ్యాన్ని పరిచయం చేసిన టీమ్.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

‘ఒకరేలే ఒకరేలే.. ఇద్దరిలా మెరిశారే.. ఒకలాంటి హృదయాలే ఒక్కటిగా కలిశాయే.. అనగా అనగా అమెరికా.. కథ మొదలిక.. మది గదులని తెరువగా.. సరదా సరదా తీరుగా కథ సాగేనుగా.. వింటారా సరదాగా’  అంటూ సాగిన పాటకు సనారె క్యాచీ లిరిక్స్ అందించగా, విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన విధానం, సంజిత్ హెగ్డే పాడిన తీరు ఆకట్టుకుంది. 

విజయ్ పొలాకి కొరియోగ్రఫీలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ మధ్య కుదిరిన సహజమైన కెమిస్ట్రీ  పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫారిన్‌‌‌‌ లొకేషన్‌‌‌‌లో చిత్రీకరించిన విజువల్స్ఆకట్టుకున్నాయి. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

©️ VIL Media Pvt Ltd.