Reading Time: 2 minutes
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos Udaipur Virush

ViRosh Wedding: టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. ఈ ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శుభ ముహూర్తాన విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు.

READ ALSO: Traffic Advisory: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!

Virosh 1

హిందూ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఆ తర్వాత రష్మిక సొంత ప్రాంతమైన ‘కొడగు’ (కర్ణాటక) సంప్రదాయ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీరిని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోషి’ (ViRo-shi) అనే పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. విజయ్, రష్మిక పెళ్లి అంగరంగ వైభవంగా జరగడంతో టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని ఇలా వ్యక్తపరిచారు.. “హాయ్ మై లవ్స్.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నాను.. మిస్టర్ విజయ్ దేవరకొండ!”.. అంటూ రాసుకొచ్చారు. ఇన్నాళ్లూ వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న రూమర్లకు రష్మిక ఈ పోస్ట్‌తో ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా, తన పెళ్లి విషయాన్ని స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హీరో విజయ్ దేవరకొండ కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో తన పెళ్లి ఫోటోలను పంచుకున్నారు.

Virosh 2

 

Virosh3

 

Virosh 4

READ ALSO: Sunetra Pawar: ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా లేడీ బాస్..