Reading Time: < 1 minute
Zim Vs Ind In Icc Mens T20 World Cup 2026 India Post Record 256 Vs Zimbabwe Highest T20 World Cup Total

ZIM vs IND: చెన్నై MA చిదంబరం స్టేడియంలో జరిగిన సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో భారత బ్యాటింగ్ చేపట్టి అదరగొట్టింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక స్కోర్‌. మొదటి 5 ఓవర్లలో టీమిండియా 80 పరుగులు సాధించింది.

విరోష్ వెడ్డింగ్ మ్యాజిక్! విజయ్-రష్మిక ట్రెడిషనల్ సెరిమనీ ఫోటోస్‌.. ప్యూర్ బ్లిస్!

ఇక టీమిండియాకు ఈ ఇన్నింగ్స్ లో ఫ్లైయింగ్ స్టార్ట్ లభించింది. ఓపెనర్ సంజు శాంసన్ 15 బాల్స్‌లో 24 రన్స్ చేసి అవుట్ కాగా.. ఫామ్ లేమితో బాధపడుతున్న అభిషేక్ శర్మ 30 బాల్స్‌లో 55 రన్స్‌తో తన మొదటి టీ20 వరల్డ్ కప్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ 24 బాల్స్‌లో 38 రన్స్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బాల్స్‌లో 33 రన్స్ చేసి బౌండరీలు, సిక్సర్లతో అదరగొట్టారు. చివర్లో హార్దిక్ పాండ్యా 23 బాల్స్‌లో 50 రన్స్ నాటౌట్‌, తిలక్ వర్మ 16 బాల్స్‌ లో 44 పరుగుల నాటౌట్‌ తో భారీ స్కోర్ కు బాటలు వేశారు.

T20 World Cup 2026: గొప్ప సహాయం చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా సెమీఫైనల్స్ ఛాన్సెస్ మరింతగా మెరుగు!

జింబాబ్వే బౌలర్లలో జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజారబాని, సికందర్ రాజా వికెట్లు తీశారు. అయితే భారత బ్యాటర్ల దాడికి అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. దీంతో ఇప్పుడు జింబాబ్వేకి 257 రన్స్ ఛేజ్ చేయాల్సి ఉంది. ఇండియా బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లాంటి స్టార్లతో ఉండడంతో కాబట్టి జింబాబ్వేకి ఈ ఛేజ్ అసాధ్యమే. చూడాలి మరి జింబాబ్వే ఎంతవరకు పోటీ ఇవ్వగలదో.