Reading Time: 2 minutes
Save Punarvika Sma Baby Fundraising Success Telugu States Kurnool Suresh Kumar

Save Punarvika: సేవ్ పునర్విక.. తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన పేరు ఇది. పేరు కాస్త నినాదంలా మారింది. 11 నెలల పాపను ఎలాగైనా రక్షించాలని తెలుగు రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు. చివరకు అనుకున్నది సాధించారు. సాధారణ జనాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెసర్లు ఒక్కసారిగా స్పందించి పాప ట్రీట్మెంట్‌కు అవసరమైన డబ్బుల్ని ఎట్టకేలకు సమకూరేలా చేశారు. వైద్య చికిత్స సరిపడా నగదును సేకరించి చిన్నారి పునర్వికకు పునర్జన్మ ప్రసాదించారు. ఈ మేరకు తాజాగా పునర్విక తండ్రి సురేశ్‌కుమార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. “ఈ రోజు నుంచి అన్ని చోట్ల ఫండిగ్ ఆపేసేయండి. ఇక ఎవ్వరు అమౌంట్ డొనేషన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్ గమనించండి.” అని భావోద్వేగంతో పేర్కొన్నారు. దీంతో తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాపకు సహకరించిన ఇన్‌ఫ్లుయెసర్లు, నగదు డొనేట్ చేసిన దాతల ఆనందానికి అవదులు లేవు. అయితే.. పునర్విక ట్రీట్‌మెంట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? అనే అంశంపై క్లారిటీ లేదు. త్వరలో ఈ అంశంపై క్లారిటీ రానుంది.

READ MORE: AC Prices Hike: ఏసీలు కొనాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. 15 శాతం పెరగనున్న ధరలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేశ్‌కుమార్‌, పుష్పావతిల కుమార్తె పునర్విక. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగలి సురేశ్‌కుమార్‌, పుష్పావతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పునర్వికశ్రీ 2025 మే 12న జన్మించింది. పునర్విక ఆరు నెలలైన తన శరీరాన్ని కదిలించలేక పోయింది. దీంతో కంగారు పడిన పేరెంట్స్ సమీప కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఆ డాక్టర్ల సిఫార్స్ మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పటల్‌కు తీసుకెళ్లారు.. చిన్నారిని పరిస్థితి, రిపోర్ట్స్‌ను పూర్తిగా పరిశీలించిన వైద్యులు అరుదైన సమస్యను గుర్తించారు. స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ (SMA)అనే జన్యుపరమైన సమస్య ఉందని స్పష్టం చేశారు. SMA అనేది వెన్నెముకలోని నరాల కణాలను (motor neurons) దెబ్బతీసే ఒక జన్యుపరమైన వ్యాధి. ఇది కండరాల బలహీనత, క్షీణతకు (atrophy) దారితీస్తుంది. ఈ వ్యాధి వల్ల నడక, శ్వాస, మింగడం, కదలికలు కష్టమవుతాయి. ఇది తరచుగా పిల్లలలో కనిపిస్తుంది. దీనికి న్యూసిన్సెన్, జోల్జెన్స్మా, రిస్డిప్లామ్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఒక్క ఇంజెక్షన్ విలువ రూ. 16 కోట్లు ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ద్వారా పునర్విక బతుకుతుందట. తాజాగా ఆ ట్రీట్‌మెంట్‌కు కావాల్సిన డబ్బు లభించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Trump: భారత్ టార్గెట్‌గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు