Reading Time: < 1 minute
Rajahmundry Adulterated Milk Incident Death Toll Rises To Five

Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన విషాదంగా మారుతుంది. ఇప్పటికే కల్తీ పాలు సేవించి ఐదుగురు మృతి చెందగా, 15 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. కిడ్నీ సమస్యలతో అనూరియా వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుంది. చికిత్స పొందుతున్న 15 మంది వైద్యానికి అయ్యే ఖర్చును ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది. అయితే, వైద్య సేవలు అందించే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయనున్నారు. కల్తీ పాలు ఘటన జరిగిన రాజమండ్రిలోని చౌడెశ్వరీ నగర్, స్వరూప్ నగర్ లలో మెడికల్ క్యాంపులను కొనసాగిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ క్యాంపులు కొనసాగనున్నాయి.

Read Also: King Buddha : హాలీవుడ్ రేంజ్‌లో ‘కింగ్ బుద్ధ’.. ప్రపంచ శాంతి పాదయాత్రలో డైరెక్టర్ సత్యారెడ్డి!

అలాగే, రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంతో ఒక్కసారిగా జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా పాల విక్రయాలు జరిగే చోట దగ్గర దగ్గర తనిఖీలు చేపట్టారు. శ్రీకంఠం కూడలి, శారద నగర్, శ్రీ శ్రీనగర్ కాలనీ సమీపంలోని నీరు ప్రగతి పార్కు సమీపంలోనూ పాల షాంపుల్స్ సేకరించారు. ప్రాథమికంగా కొన్ని లోపాలు గుర్తించాం.. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు.