Reading Time: < 1 minute

యువతే వీరి టార్గెట్..అక్రమ మెఫెంటెర్‌మైన్ ఇంజెక్షన్ల దందా..హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్ట్

Caption of Image.

జిమ్ సెంటర్లే వీరి అడ్డా.. యువతే వీరి టార్గెట్.. కండలు పెంచాలనే ఆశతో ఉన్న యూత్  వీరి అక్రమ దందాకు సోర్స్.. యువత  ఆశలను అడ్డంగా పెట్టుకునే నిషేధిత ఇంజెక్షన్లను సరఫరా చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో అక్రమంగా మెఫెంటెర్ మైన్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముఠాను  చార్మినార్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులనుంచి 4లక్షల రూపాయల విలువైన మెఫెంటెర్ మైన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. 

శుక్రవారం( జూలై31 అక్రమంగా మెఫెంటెర్ మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నర  ముగ్గురు వ్యక్తులను చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ , సైఫాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి అరెస్ట్ చేశారు. టప్పాచబుత్రాకు చెందిన షేక్ ఫహీమ్, మహమ్మద్ నయీమ్, ఇబ్రహీం హుస్సేన్ లను అదపులోకి తీసుకున్నారు. వారి నుంచి  4లక్షల రూపాయల విలువైన 100 మెఫెంటెర్  మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వైయల్స్, బైకు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నరారు. 

యూపీలోని మీరట్ నుంచి  అక్రమంగా ట్రాన్స్ పోర్టు ద్వారా ఇంజెక్షన్లను తెప్పించి సిటీలోని జిమ్ లో వర్కవుట్స్ చేసే యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి డాక్టర్ డిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి ఇంజెక్షన్ల వాడకం ప్రాణాంతకమని, యువతనిషేధిత ఔషధాలకు దూరంగా ఉండాలని  హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు  హెచ్చరించారు. 

మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్..

ఈ ఇంజెక్షన్ ణు అక్యూట్ హైపోటెన్షన్,  ఆపరరేషన్ టైంలో,  వెన్నెముక అనస్థీషియా తర్వాత బ్లడ్ ప్రెజర్ పడిపోకుండా వాడే ఒక అత్యవసర మెడిసిన్. ఇది గుండె పనితీరును ఉత్తేజపరుస్తుంది.  రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేయడం ద్వారా బ్లడ్ ప్రెజర్ ను వేగంగా పెంచుతుంది. నిషేధం ఉన్నప్పటికీ కండలు పెంచాలనే ఆశతో, తక్కువ సమయంలో సిక్స్ ప్యాక్ సాధించేందుకు,జిమ్‌లో ఎక్కువసేపు వర్కవుట్స్ చేసే స్టామినా కోసం మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను యువత అక్రమంగా వాడుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.