Reading Time: < 1 minute
Band Melam Teaser Launch Event Shivaji Comments Harsh Roshan Sridevi

గతేడాది చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘కోర్ట్’. ఆ చిత్రంతో పాపులర్ అయిన హర్ష్ రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “బ్యాండ్ మేళం” (Band Melam). మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ రూపొందించిన ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు తమన్ నటుడు శివాజీ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా..

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. ‘బ్యాండ్ మేళం’ చిత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కిందని ప్రశంసించారు. ఈ సినిమాలో తాను ఒక కీలక పాత్ర చేయాల్సి ఉందని,కానీ అది రొటీన్ అవుతుందనే ఉద్దేశంతో సున్నితంగా తిరస్కరించానని ఆయన వెల్లడించారు. నటీనటుల గురించి ప్రస్తావిస్తూ.. శ్రీదేవి అద్భుతమైన నటి అని, రోషన్ చాలా టాలెంట్ ఉన్న నటుడని, భవిష్యత్తులో అతను గొప్ప స్థాయికి వెళ్తాడని శివాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కోర్ట్’ సినిమాను గత ఏడాది మార్చి 13న ప్రీమియర్ వేసి ఘనవిజయం అందుకున్నామని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ కూడా అదే సెంటిమెంట్‌తో మార్చి 13న విడుదల కాబోతోందని, ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.