Reading Time: 2 minutes
Pakistan Semi Final Chances After Loss To England T20 World Cup Super 8 Scenarios

Pakistan vs England: పాకిస్థాన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలించింది. ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌ను పాక్ కోల్పోయింది. టీ20 వరల్డ్‌కప్ సూపర్–8లో ఇంగ్లండ్‌తో రెండు వికెట్ల తేడాతో ఓడిపోవడం వల్ల సెమీఫైనల్ ఆశలు క్లిష్టంగా మారాయి. 165 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో ఛేజ్ చేయగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత శతకం మ్యాచ్‌ను తమ వైపునకి తిప్పింది. 51 బంతుల్లో చేసిన ఈ సెంచరీ కేవలం మ్యాచ్ గెలిపించడమే కాదు.. ఇంగ్లండ్‌ను నేరుగా సెమీఫైనల్‌కు చేర్చింది. రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో గ్రూప్–2 నుంచి ముందుగా అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. మరోవైపు రెండు మ్యాచ్‌ల్లో ఒక్క పాయింట్‌తో ఉన్న పాకిస్థాన్‌కు చివరి మ్యాచ్ “డూ ఆర్ డై”గా మారింది. ఇంతకీ పాకిస్థాన్‌కు సెమీఫైనల్ ఆశలు ఉన్నాయా? అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం..

READ MORE: OTT: ఓటీటీ లవర్స్ కు షాక్.. ఐదు OTT ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసిన కేంద్రం.. లిస్ట్ లో ఉన్నవి ఇవే

ప్రస్తుతం గ్రూప్‌లో ఇంగ్లండ్ టాప్‌లో ఉంది. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌తో ఒక పాయింట్, పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లతో ఒక పాయింట్‌ సాధించడగా.. శ్రీలంక ఇంకా ఖాతా తెరవలేదు. ఇక మిగిలిన మ్యాచ్‌లు మొత్తం సమీకరణాన్ని మార్చబోతున్నాయి. న్యూజిలాండ్–శ్రీలంక, న్యూజిలాండ్–ఇంగ్లండ్, పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్‌లు గ్రూప్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే శ్రీలంకపై తప్పక గెలవాలి. అలా గెలిస్తే మూడు పాయింట్లు వస్తాయి. కానీ ఈ గెలుపు సైతం పాకిస్థాన్‌కు సరిపోదు. పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరాలంటే.. ఇతర మ్యాచ్‌లపై ఆధారపడక తప్పదు. ఇంగ్లండ్ న్యూజిలాండ్‌ను ఓడించాలి. అలాగే శ్రీలంక న్యూజిలాండ్‌పై గెలవాలి. అప్పుడు పాకిస్థాన్ (3), శ్రీలంక (2), న్యూజిలాండ్ (1) పాయింట్లు వస్తాయి. దీంతో పాక్ రెండో స్థానంలో సెమీఫైనల్‌కు చేరుతుంది.

READ MORE: T20 World Cup 2026: ఉత్కంఠ పోరులో పాక్‌ ఓటమి.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్‌

ఇదిలా ఉండగా.. ఒకవేళ న్యూజిలాండ్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఒకటి ఓడిపోతే, పాకిస్థాన్ శ్రీలంకపై గెలిచినట్లయితే రెండు జట్లు మూడు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు ఎన్ఆర్ఆర్ మెరుగ్గా ఉండటం పాక్‌కు సమస్యగా మారింది. అయితే శ్రీలంక చేతిలో ఓడిపోతే మాత్రం పాకిస్థాన్ టోర్నమెంట్ నుంచి నేరుగా బయటపడుతుంది. ఒకవేళ పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే పాక్ రెండు పాయింట్లతో ముగుస్తుంది. అదే సమయంలో శ్రీలంక–న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దయి, న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోతే మూడు జట్లు రెండు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు ఎవరి నెట్ రన్‌రేట్ బెటర్‌గా ఉన్న టీమ్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 28న జరిగే పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్‌పైనే ఉంది. ఈ మ్యాచ్‌ పాకిస్థాన్‌కు డూ ఆర్ డై మ్యాచ్.