Reading Time: < 1 minute

వ్యాపారంలో నష్టం వచ్చిందని తీవ్ర మనస్థాపానికి గురై ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఈ విషాద సంఘటన మంగళవారం అంబర్ పేటలో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట బాపు నగర్ ప్రాంతంలో నివసించే కదేకర్ రామ్ రాజ్(54) పార్ట్నర్ షిప్ లో హోటల్ వ్యాపారం చేసినాడు. అందులో తీవ్ర నష్టం రావడంతో అప్పుల బాధ తట్టుకోలేక రామ్ రాజ్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా నిర్ణయించుకుని ఈ ఆత్మహత్యలకు ఎవరికి సంబంధం లేదని లేఖ రాసి పెట్టారు. మంగళవారం ఉదయం ముందుగా భార్య కే. మాధవిని(50) దిండుతో ముఖంపై ఒత్తి చంపాడు. అనంతరం కొడుకు కె.శశాంక్ రాజు(27) తన మిత్రుడు రవికి మేము చనిపోతున్నామని ఫోన్‌లో మెసేజ్ పెట్టి తండ్రి రామ రాజ్ తో కలిసి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న రవి ఉదయం 8 గంటలకు అంబర్ పేట లో నివాసానికి చేరుకోగా తలుపు ఓపెన్ ఉండటంతో తెరిచి చూడగా తండ్రి కొడుకులు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతున్నట్లు కనిపించారు. వెంటనే విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యురాలు కె. అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్ళగా ముగ్గురు మృతి చెందిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల దర్యాప్తు అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాలు బంధువులకు అప్పగించారు. సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.