Reading Time: < 1 minute

నాలా కన్వర్షన్ కోసం రూ.70 వేల లంచం..ఏసీబీకి చిక్కిన చేర్యాల తహశీల్దార్

Caption of Image.

 సిద్దిపేట జిల్లా చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. లంచం తీసుకుంటూ చేర్యాల తహశీల్దార్ దిలీప్ నాయక్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఒక రైతు తన భూమికి సంబంధించిన నాలా (NALA) కన్వర్షన్ కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయితే, ఆ పని చేసి పెట్టడానికి తహశీల్దార్ దిలీప్ నాయక్ సదరు రైతును 70 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ రైతు… అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించాడు.

ఈ క్రమంలో ఈరోజు రైతు నుంచి తహశీల్దార్ దిలీప్ నాయక్ 70 వేల రూపాయల నగదు తీసుకుంటుండగా… ముందస్తు ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లంచం డబ్బులతో తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.