July 6, 2026

Naga Vamsi: “మేం కంటెంట్ ఓనర్లం.. ఎప్పుడు డ్యామేజ్ చేయాలో మాకు తెలుసు!”.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్!

Naga Vamsi: “మేం కంటెంట్ ఓనర్లం.. ఎప్పుడు డ్యామేజ్ చేయాలో మాకు తెలుసు!”.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్!
Reading Time: < 1 minute
Producer Naga Vamsi Shocking Comments On Tollywood Critics And Akhil Lenin Release

Naga Vamsi: టాలీవుడ్‌లో ఎప్పుడూ లౌడ్‌గా, స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటూ ‘ఫైర్ బ్రాండ్’ అనిపించుకునే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్‌గా ఉండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉంటున్నారని, కామెంట్స్ చేయడం తగ్గించారని వస్తున్న రూమర్లపై తనదైన శైలిలో స్పందించారు. తన మౌనం వెనుక ఒక బలమైన వ్యూహం ఉందని చెబుతూ తనను టార్గెట్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇటీవలి కాలంలో ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. “వాళ్లు డబ్బు ఉన్నోళ్లు.. ఏమన్నా మాట్లాడతారు. వాళ్లు అన్న మాటలకి మనం ఇమ్మీడియట్‌గా రిప్లై ఇస్తే.. వాళ్ల మీద మనకి జెలసీ (అసూయ) ఉందని అనుకుంటారు. అందుకే నేను వెనక్కి తగ్గాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేం కంటెంట్ ఓనర్లం! మేం చేయాల్సిన డ్యామేజ్ ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో మాకు బాగా తెలుసు. దానికి కచ్చితంగా ఒక టైమ్ వస్తుంది” అని నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఫిలిం ఛాంబర్ మీటింగుల్లో జరిగిన వాడివేడి చర్చల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఛాంబర్‌లో నిర్మాతలు అరుచుకోవడం, గొడవలు పడటం అనేది చాలా కామన్ విషయమని, దీనిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నారు. అయితే తనపై విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “ఇక్కడి నుంచి ఎవరూ ఎక్కడికీ వెళ్లరు, అందరం ఇండస్ట్రీలోనే ఉండాలి. మెల్లిగా నా దగ్గరున్న అస్త్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి, అప్పటివరకు వేచి చూడండి” అంటూ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే ఆయన నిర్మాతగా అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించారు. తమన్ స్వరాలు అందించగా అక్కినేని నాగార్జునతో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.