Reading Time: < 1 minute
Akhilesh Yadav Tinnu Yadav Ram Temple Donation Theft Calls

Ram Temple donation theft: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు విచారణకు యోగి సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు రామ మందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాకు ఆమోదం లభించింది. మరోవైపు ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయోధ్య వ్యవహారం రాజకీయ అంశంగా మారింది.

ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ ఏడాది కాలంగా అఖిలేష్ యాదవ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ చీఫ్‌తో తరుచుగా ఫోన్‌‌లో మాట్లాడినట్లు పోలీసులు పరిశీలిస్తున్న కాల్ డిటెయిల్ రికార్డ్(సీడీఆర్) సూచిస్తోందని సమాచారం. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పందిస్తూ.. టిన్నూ యాదవ్ అఖిలేష్ యాదవ్‌తో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.

టిన్నూ యాదవ్ ప్రతీరోజూ దాదాపు ఒకటి లేదా రెండుసార్లు అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతడి అరెస్టుకు ముందు, టిన్నూ అఖిలేష్‌తో రోజుకు మూడుసార్లు మాట్లాడినట్లు కాల్ రికార్డ్స్ సూచిస్తున్నట్లు సమాచారం. మరో ఆరు నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ చోరీ అంశం బీజేపీ, ఎస్పీల మధ్య రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు అఖిలేష్-టిన్నూ సంబంధాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయని అంతా ఎదురుచూస్తున్నారు.