అఖిల్ ‘లెనిన్’లో ఎన్టీఆర్ సర్‌ప్రైజ్.. పులి పోస్టర్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..! అంచనాలు డబుల్..!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జులై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. చిత్తూరు జిల్లా రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.
‘లెనిన్’ కు ఎన్టీఆర్ వాయిస్
ఈ పోస్టర్‌లో అఖిల్ లుక్ లేకుండా కేవలం ఓ పులి రూపం, ‘లెనిన్’ టైటిల్ లోగో మాత్రమే కనిపించాయి. దీంతో అభిమానులు మొదట అయోమయంలో పడినా, వెంటనే మేకర్స్ ఆ పోస్టర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టారు. ఈ సినిమాకు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో కథను నడిపించే నేరేషన్ అందించారు. పోస్టర్‌లోని పులి చిహ్నం ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని, ఆయన గంభీరమైన స్వరాన్ని ప్రతిబింబించేలా రూపొందించారని వెల్లడించారు.
#Lenin 🐅🔥 pic.twitter.com/pe0DCjJxIQ
— Sithara Entertainments (@SitharaEnts) July 6, 2026
ఫొటోలు వైరల్..
లేటెస్ట్ గా ఎన్టీఆర్‌తో కలిసి అఖిల్, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి దిగిన ఫొటోలను కూడా చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ సర్‌ప్రైజ్ అధికారికంగా ఖరారైంది. దీంతో అఖిల్, ఎన్టీఆర్ అభిమానుల్లో సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది. థియేటర్‌లో ఎన్టీఆర్ వాయిస్‌తో సినిమా ప్రారంభమైతే ఆ అనుభూతి మరో స్థాయిలో ఉంటుందని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
A world born out of conviction.
Introduced by a voice that needs no introduction ❤️🔥❤️🔥❤️🔥Man of Masses @tarak9999 lends his voice to introduce Sriramapuram & Bharatham Mitta at the beginning of #LENIN 💥💥💥#LeninOnJuly10th @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna… pic.twitter.com/qP7ROGeJq6
— Sithara Entertainments (@SitharaEnts) July 6, 2026
భారీ అంచనాలతో రెడీ..
ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ పొలిటికల్ డ్రామాకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్రయూనిట్ చెబుతోంది.