July 6, 2026

Budhaditya Yoga: ఈ రాశుల జాతకం మారుతుంది.. ఇక జీవితంలో దశ తిరిగినట్టే..!

Budhaditya Yoga: ఈ రాశుల జాతకం మారుతుంది.. ఇక జీవితంలో దశ తిరిగినట్టే..!
Reading Time: 2 minutes
Budhaditya Yoga: ఈ రాశుల జాతకం మారుతుంది.. ఇక జీవితంలో దశ తిరిగినట్టే..!

సాధారణంగా రవి, బుధుల యుతి ఎప్పుడు, ఏ రాశిలో జరిగినా కొన్ని రాశులవారి జీవితాల్లో తప్పకుండా కొద్దోగొప్పో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అటువంటిది బుధుడికి స్వస్థానమైన మిథునంలో జరిగినప్పుడు అది అనేక రెట్లు ఎక్కువగా శుభ ఫలితాలనిస్తుంది. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల ఏర్పడే బుధాదిత్య యోగం ఏ రాశివారికైనా పట్టినప్పుడు సమస్యల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి కూడా అందులోంచి బయటపడి చక్కటి జీవితాన్ని అనుభవిస్తాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రెండు గ్రహాలు వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారికి జూలై 7 నుంచి 16 వరకూ ఈ బుధాదిత్య యోగ ఫలితాలనిస్తాయి.

  1. వృషభం: ఈ రాశికి ధన స్థానంలో బుధ, రవులు కలవడం వల్ల ఆర్థిక, కుటుంబ పరిస్థితులు బాగా మెరుగు పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, వ్యాపారాల్లో పెట్టుబడులు అంచనాలకు మించి లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు జీతభత్యాలు కూడా అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమై కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సర్వత్రా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశిలో రాశ్యధిపతి బుధుడితో రవి కలవడం వల్ల ఈ రాశివారి ప్రతిభా పాటవాలు, శక్తిసామ ర్థ్యాలు బాగా రాణిస్తాయి. ఊహించని విధంగా ధన యోగాలు, రాజయోగాలు పడతాయి. జీవన శైలి మారిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థితిగతులు మెరుగుపడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు.
  3. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి రవితో బుధుడు కలవడం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. సమర్థతకుగుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. లాభదాయక పరిచ యాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాల్లో యాక్టి విటీ పెరిగి లాభాలు అంచనాల్ని మించుతాయి. ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు వింటారు.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రవి కలవడం వల్ల రాజపూజ్యాలు, రాజయో గాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో బాగా లబ్ధి పొందుతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  5. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలు గుతాయి. ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు శుభ వార్తలు వింటారు. తల్లితండ్రుల నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. పట్టిందల్లా బంగారమవు తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
  6. ధనుస్సు: ఈ రాశివారికి సప్తమ స్థానంలో రవి, బుధులు కలిసినందువల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి.

Also Read: వారికి కాలసర్ప దోష విముక్తి.. ఆర్థికంగా శీఘ్ర పురోగతి..!