
హైదరాబాద్: తెలంగాణలో రేపటి (అక్టోబర్ 10) నుంచి పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. స్కూల్స్కు రేపటి (అక్టోబర్ 10) నుంచి అక్టోబర్ 22 వరకు సెలవులు ప్రకటించారు. జూనియర్ కాలేజీలకు రేపటి (అక్టోబర్ 10) నుంచి 21 వరకు సెలవులు ప్రకటించడం గమనార్హం.
స్కూళ్లకు 13 రోజులు, ఇంటర్ కాలేజీలకు 12 రోజుల పాటు దసరా హాలిడేస్ ఉండనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ తో పాటు అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి. తిరిగి అక్టోబర్ 23న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి.
ఇంటర్మీడియట్ బోర్డు క్యాలెండర్ ప్రకారం.. అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని జూనియర్ కాలేజీలకు ఈ నెల10 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 22న కాలేజీలు తెరుచుకోనున్నాయి.
హాలిడేస్షెడ్యూల్ను విద్యా సంస్థలన్నీ కచ్చితంగా పాటించాలని, దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించొద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేయడం గమనార్హం.