
కింగ్ సినిమాను చాలా ప్రెస్టిజియస్‌గా తీసుకుంటున్నాడు షారూఖ్. కూతురు సుహానా ఖాన్‌ను పరిచయం చేస్తోన్న మూవీ కావడంతో సినిమా సక్సెస్‌కు కావాల్సిన అన్నీ హంగులు అద్దుతున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ దీపికా పదుకొణేతో సిక్త్ టైం కలిసి వర్క్ చేస్తోన్న కింగ్ ఖాన్.. వన్స్ ఆపాన్ ఎ టైం లక్కీ గర్ల్ రాణీ ముఖర్జీని పట్టుకొచ్చాడు. 20 ఏళ్ల తర్వాత రాణీ ముఖర్జీ అండ్ షారూఖ్ నటిస్తుండటంతో ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా మరో బ్యూటీ కరీనా కపూర్‌ను పట్టుకొస్తున్నాడట బాద్ షా.
కింగ్‌లో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుందట కరీనా కపూర్. పదేళ్ల క్రితమే ఐటమ్ సాంగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన కరీనా, షారూఖ్ ఖాన్ అడగడంతో కాదనలేక డేట్స్ ఇచ్చిందట. ఈ నెల చివరిలో దక్షిణాఫ్రికాలో డాడీ కూల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ సాంగ్ కోసం ఐదు రోజుల పాటు కాల్షీట్స్ కేటాయించిందట కరీనా. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని బాలీవుడ్ టాక్. షారూఖ్ అండ్ కరీనా కపూర్ 15 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అశోక మూవీతో మొదలైంది వీరి జర్నీ. కభీ ఖుషీ కభీ గమ్‌లో మరదలిగా మెప్పించిన కరీనా, డాన్ అండ్ బిల్లులో స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. చివరి సారిగా రావన్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ జోడీ. ప్రస్తుతం కరీనా కపూర్ కెరీర్ డల్‌గా నడుస్తోంది. ఇటీవల వచ్చిన డాయిరా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ హీరోయిన్స్‌కు ఆఫర్స్ తెచ్చిపెడుతోన్న వేళ కరీనా కూడా ఇటు వైపుగా స్టెప్స్ వేస్తోంది.