Reading Time: < 1 minute

దసరా షాపింగ్ ప్లాన్ చేస్తున్నోళ్లకు షాక్.. హైదరాబాదులో పెరిగిన బంగారం ధర

Caption of Image.

గడచిన కొద్ది రోజులుగా తగ్గుతూ ఉన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. త్వరలోనే రానున్న దసరా, దీపావళికి బంగారం, వెండి కొందాం అనుకుంటున్న తెలుగు ప్రజలకు మళ్లీ పెరుగుతున్న రేట్లు షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆభరణాలు కొనాలనుకుంటున్న వారు ముందుగా తమ నగరాల్లో మారిన గోల్డ్, సిల్వర్ రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.

అక్టోబర్ 9న బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.114 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 071గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 815గా కొనసాగుతోంది. 

ALSO READ : అమెజాన్ లో ఫెస్టివల్ సేల్… ఫ్లిప్కార్ట్ లోనూ ప్రారంభం

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 9, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.

©️ VIL Media Pvt Ltd.