Reading Time: < 1 minute

ఓటమి భయంతోనే ఇండియా కూటమి విషప్రచారం : బీజేపీ నాయకుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వి. సుభాష్

Caption of Image.
  •     కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి దిగజారుడు రాజకీయాలు 
  •     బీజేపీ నాయకుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వి. సుభాష్​ కామెంట్

హైదరాబాద్​, వెలుగు: రాజ్యాంగ సంస్థలపై ఇండియా కూటమి విష ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ తీవ్రంగా విమర్శించారు. ఓటమి భయంతోనే ఆ కూటమి నాయకులు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు గురువారం బీజేపీ రాష్ట్ర  కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వి. సుభాష్ మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దశాబ్దాలుగా నిష్పక్షపాతంగా సేవనందిస్తున్న గొప్ప వ్యవస్థ అని కొనియాడారు. 

1993లో టీఎన్ శేషన్ హయాంలో ఏకసభ్య కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఈసీని, ముగ్గురు సభ్యుల కమిటీగా మార్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు. ఈసీ చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసనల పేరుతో వింత చేష్టలకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాసమస్యలపై చర్చించకుండా, రోడ్లపై పడుకుని చిల్లర రాజకీయాలతో మీడియా దృష్టిని ఆకర్షించేందుకు రాహుల్ దిగజారిపోయారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం గురించి, ఓటు హక్కు గురించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు డా. రాహుల్, అభిషేక్, మహేశ్, డా. పల్నాటి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.