Reading Time: < 1 minute
Pawan Kalyan Polavaram Visit Postponed To October 12

Deputy CM Pawan Kalyan: పోలవరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన ఆయన పర్యటనను ఈ నెల 12వ తేదీకి మార్చినట్లు అధికారులు ధృవీకరించారు. వరుసగా పర్యటన వాయిదా పడుతుండటంతో జనసేన శ్రేణుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు, పవన్ కల్యాణ్ పర్యటనపై మన్యం ప్రాంత ప్రజల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. పర్యటన వాయిదా పడినప్పటికీ, అధికారులు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక అధికారులు, భద్రతా సిబ్బంది రంపచోడవరం చేరుకున్నారు. కాకవాడలో హెలిప్యాడ్‌తో పాటు బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

అలాగే, రాకోట గ్రామంలో స్థానిక ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ పర్యటన ఈ నెల 12న ఉంటుందని అధికారులు వెల్లడించారు. వరుస వాయిదాల నేపథ్యంలో ఈసారైనా పర్యటన నిర్ణీత తేదీన జరుగుతుందా అనే ఆసక్తి జనసేన శ్రేణులు, మన్యం ప్రజల్లో నెలకొంది.