Reading Time: < 1 minute
Ap Telangana Dussehra School Holidays October Reopening Dates

Dussehra Holidays 2026: విద్యార్థులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో కాలంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్న దసరా శరన్నవరాత్రి పండుగ సెలవులు రానే వచ్చాయి. నిజానికి ఈ ఏడాది అధికారికంగా అక్టోబర్ 12వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11న ఆదివారం సాధారణ సెలవు దినాలు కావడంతో ఆ వీకెండ్ సెలవులు కూడా పండుగ సెలవులతో కలిసి వచ్చాయి. దీనివల్ల విద్యార్థులకు రెండు రోజుల ముందుగానే, అంటే అక్టోబర్ 10(రేపటి) నుంచే వరుస సెలవులు వర్తించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించారు. ఇలా మొత్తం పదమూడు రోజుల పాటు పాఠశాలలకు సుదీర్ఘ విరామం లభించనుంది. సెలవులన్నీ ముగిసిన అనంతరం తెలంగాణలో పాఠశాలలు తిరిగి అక్టోబర్ 23వ తేదీన యథావిధిగా పునఃప్రారంభం అవుతాయి. అలాగే ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలకు మాత్రం అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు ఉంటాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వారాంతపు సెలవులతో కలిపి అక్టోబర్ 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మొత్తం పన్నెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 22న స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి. ఇంటర్‌ కాలేజీలకు కూడా ఈ నెల 21 వరకు సెలవులు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ దసరా పండుగ విరామ సమయంలో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సంబరాలు ముగిసిన తర్వాత విద్యార్థులు నూతన ఉత్సాహంతో తిరిగి తమ పాఠశాలలకు హాజరుకానున్నారు.