Reading Time: < 1 minute

రాజ్ ఘాట్ దగ్గర నిరసన.. లంచ్ మీటింగ్ తర్వాత ఇండియా బ్లాక్ ప్రకటన

Caption of Image.

ఢిల్లీ మోట్స్ హోటల్ లో ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్ తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటించారు కూటమి నేతలు. రాజ్ ఘాట్ దగ్గర నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే.  కూటమి ఎంపీలంతా శాంతియుత నిరనసన చేయనున్నట్లు చెప్పారు.  నుంచి రాజ్ ఘాట్ కు బస్సులో బయలుదేరిన కూటమి నేతలు

బీజేపీ ప్రభుత్వానికి మంచి సద్బుద్ధినివ్వాలని ఆ దేవుడిని కోరుతున్నామని ఖర్గే అన్నారు. బీజేపీ సర్కార్ పెరుగుతున్న ధరలపై నజర్ పెట్టాలని సూచించారు. ఓట్లను చీల్చి అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజ్ ఘాట్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలుపుతామని ప్రకటించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. నులుగురు వ్యక్తులే ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టించారని విమర్శించారు.  శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే అడ్డుకుంటున్నారని అన్నారు. జంతర్ మంతర్ వెళ్తామంటే అడ్డుకున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్తామంటే అడ్డుకున్నారు. 

ఇక కూటమి నేతలంతా బస్సులో రాజ్ ఘాట్ కు బయల్దేరారు. మోట్స్ హోటల్ లంచ్ మీటింగ్ లో సీఎం రేవంత్, హిమచల్ ప్రదేవ్ సీఎం సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. 

©️ VIL Media Pvt Ltd.