
భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటన, గంభీరమైన గొంతు, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు నానా పటేకర్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు అభిమానులు. ఆయన మరణవార్తతో సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోగా, మహారాష్ట్రలోని పుణె శివార్లలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో గురువారం అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికింది. వేలాది మంది అభిమానులు తరలివచ్చి తమ అభిమాన నటుడికి నివాళులర్పించారు. అయితే, తమ అభిమాన నటుడిని చివరిసారిగా చూసే ఆ అవకాశం దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అంత్యక్రియలు అర్ధరాత్రి వేళ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే విషయాన్ని నానా పటేకర్ కుమారుడు మల్హర్ వెల్లడించారు.
అర్ధరాత్రి దాటాక అంత్యక్రియలు: కుమారుడు ఏమన్నారంటే?
నానా పటేకర్ (Nana Patekar) అంత్యక్రియల అనంతరం మీడియాతో మాట్లాడిన మల్హర్ పటేకర్.. తమ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. తన తండ్రి భౌతికకాయాన్ని గోవా నుంచి పుణె సమీపంలోని ఫామ్‌హౌస్‌కు తీసుకురావాల్సి వచ్చిందని, అయితే అది అనుకున్న సమయానికి చేరుకోలేదని తెలిపారు. ప్రయాణంలో జాప్యం కారణంగా అంత్యక్రియలు ఆలస్యమయ్యాయని చెప్పారు.
ALSO READ : వెండితెర క్రాంతివీర్ నానా పటేకర్..
అయితే, తమ అభిమాన నటుడిని చివరిసారిగా చూసుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం దక్కిందా? అనే చర్చ కూడా అభిమానుల్లో కనిపించింది. అంత్యక్రియలు రాత్రి వేళ జరగడంతో కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే, అభిమానులకు చివరి చూపు దక్కలేదనే అంశంపై మాట్లాడుతూ.. ఉదయాన్నే విషాదం చోటుచేసుకోవడంతో చాలా సమయం గడిచిపోయిందని.. ఈ క్రమంలోనే మరో రోజుకు వాయిదా వేయకూడదనే కుటుంబం నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
తండ్రి గురించి మల్హర్ ఎమోషనల్..
అంత్యక్రియల అనంతరం తన తండ్రి వారసత్వం, సామాజిక సేవా కార్యక్రమాల గురించి మల్హర్ పటేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి తన పనుల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోతారని, నానా పటేకర్ కూడా తన సేవల ద్వారా ఎప్పటికీ ప్రజల హృదయాల్లో జీవిస్తారని పేర్కొన్నారు.
“నానా సాహెబ్ లాంటి వ్యక్తులు నిజంగా మనల్ని విడిచి వెళ్లిపోరు. వారు చేసిన పనుల ద్వారా అమరులవుతారు” అనే భావంతో ఆయన మాట్లాడారు. మానవత్వం కోసం అందరూ ఒక్కటై ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు కృషి చేయాలనేది తన తండ్రి ఎప్పుడూ చెప్పే మాట అని గుర్తుచేసుకున్నారు.
తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ బాధ్యతగా భావిస్తున్నట్లు మల్హర్ తెలిపారు. ఇప్పటికే నీటి సంరక్షణ రంగంలో ‘నామ్ ఫౌండేషన్’ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, కశ్మీర్‌లో విద్య, ఆరోగ్య రంగాల్లోనూ విస్తృత స్థాయిలో కార్యక్రమాలు ప్రారంభించామని వెల్లడించారు. తన తండ్రి వెళ్లిపోయే ముందు ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట బాధ్యతలు అప్పగించారని చెప్పారు.
#WATCH : Nana Patekar’s Son Malhar Lights His Funeral Pyre Thousands gathered in Pune on Thursday night to bid a tearful farewell to legendary actor Nana Patekar. The 75-year-old actor’s last rites were performed with full state honours at his farmhouse in Donje village, as mourners chanted “Nana Amar Rahe.” His son Malhar lit the funeral pyre. Several prominent political, film and social personalities attended the final farewell, including Jackie Shroff, Makarand Anaspure, Ramdas Athawale, Murlidhar Mohol and Maharashtra Deputy CM Sunetra Pawar. #RIPNanaPatekar #NanaPatekar #NanaPatekarDeath #NanaPatekarNoMore #Bollywood #Pune #RIP
— upuknews (@upuknews1) October 8, 2026
గుండెపోటుతో కన్నుమూసిన నానా పటేకర్..
75 ఏళ్ల నానా పటేకర్ అక్టోబర్ 8, గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో అస్వస్థతగా ఉందని తన స్నేహితుడికి సందేశం పంపినట్లు సమాచారం. అనంతరం ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు.
గోవాలోని మణిపాల్ ఆసుపత్రిలో వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు ఆయనను తిరిగి కోలుకునేలా చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం సుమారు 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు
మహారాష్ట్ర ప్రభుత్వం నానా పటేకర్ సినీ రంగానికి, ముఖ్యంగా మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలకు చేసిన విశేష సేవలను గుర్తించి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. పుణె సమీపంలోని డోణ్జే గ్రామంలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరిగాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వేలాది మంది అభిమానులు తరలివచ్చి తమ అభిమాన నటుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. కుమారుడు మల్హర్ పటేకర్ తండ్రి చితికి నిప్పంటించారు. అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం విషాదభరితంగా మారింది.
నానా పటేకర్ దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. పరిందా, క్రాంతివీర్, సలామ్ బాంబే! వంటి చిత్రాలతో నటుడిగా విశేష గుర్తింపు పొందారు. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, పద్మశ్రీ పురస్కారం ఆయన ప్రతిభకు నిదర్శనాలు. నటనకే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ తనదైన పాత్ర పోషించారు. ఆయన మరణంతో భారతీయ సినిమా ఒక విలక్షణ నటుడిని కోల్పోయింది.
A prayer meet was held to remember and pay tribute to veteran actor Nana Patekar. The actor passed away in Goa, and his last rites are set to be held at his farmhouse in Pune. Fans and well-wishers have been sharing messages and remembering the legend for his powerful acting and simple nature. See the pictures from the prayer meet. Share your tribute to Nana Patekar in the comments. #Punetimesmirror #NanaPatekar
— Pune Mirror (@ThePuneMirror) October 8, 2026