Reading Time: < 1 minute

Epic OTT Title Changed: ఓటీటీలో ‘ఎపిక్’ మూవీ టైటిల్ ఛేంజ్.. నెట్‌ఫ్లిక్స్ హఠాత్తుగా పేరు ఎందుకు మార్చిందంటే?

Caption of Image.

‘బేబీ’ హిట్ కాంబో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’.  సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో నటుడిగా ఆనంద్ , కథనాయికగా వైష్ణవి మరోసారి తమ కెమెస్ట్రీతో ఆకట్టుకున్నారు . కానీ బాక్సాఫీస్ మాత్రం ఆశించిన స్థాయిలో ఈ చిత్రం  మ్యాజిక్ చేయలేకపోయింది.  థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల తర్వాత ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రియదర్శకులను పలకరించేందుకు సిద్ధమైంది.

అయితే.. డిజిటల్ ల్యాండింగ్‌కు కొద్ది గంటల ముందు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యక్షమైన ఒక ఆసక్తికర మార్పు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒరిజినల్ టైటిల్ ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ కు బదులుగా నెట్‌ఫ్లిక్స్ తన లిస్టింగ్‌లో ‘ఎపిక్ క్లాసిక్- ఫస్ట్ సెమిస్టర్’ అని పేరు మార్చి దర్శనమిచ్చింది. ఈ సడెన్ టైటిల్ ట్విస్ట్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలియక నెటిజన్లు, సినీ ప్రియులు తీవ్ర చర్చల్లో మునిగిపోయారు.

ఈ మార్పుపై ఇది నెట్‌ఫ్లిక్స్ టీమ్ పొరపాటున చేసిన ఒక చిన్న టెక్నికల్ టైపో పొరపాటా? లేక ఓటీటీ వర్షన్ కోసం మేకర్స్ ప్లాన్ చేసిన మాస్టర్ స్ట్రాటజీయా? అనే కోణంలో ఆసక్తికర కామెంట్లు వస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన వెర్షన్‌తో పోలిస్తే, ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే ఈ క్లాసిక్ వర్షన్‌లో ఏమైనా అదనపు సీన్లు, కొత్త కట్స్ లేదా డైరెక్టర్స్ కట్ జతచేశారా అనే అంచనాలు పెరిగిపోయాయి. అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం అర్ధరాత్రి నుంచి లైవ్ కానుండటంతో, ఈ టైటిల్ వెనుక ఉన్న సస్పెన్స్ మిస్టరీ వీడనుంది

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ సమర్పణలో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన చార్ట్‌బస్టర్ సంగీతం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీలో సందడి చేయనున్న ఈ ‘ఎపిక్’సర్ ప్రైజ్ ఎలాంటి స్పందన రాబడుతుందో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.