Reading Time: < 1 minute
Nana Patekar Death Goa Police Unnatural Death Case Investigation

Nana Patekar: ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతికి సంబంధించి గోవా పోలీసులు అసహజ మరణం (Unnatural Death) కింద మెడికో-లీగల్ కేసు నమోదు చేశారు. అసలు ఆయన ఎలా చనిపోయారు? మరణానికి గల సరియైన కారణాలేంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. BNSS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, పనాజీకి చెందిన పీఎస్‌ఐ నితిన్ నాయక్‌కు ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు. దోనా పౌలాలోని ‘ఓషన్ పార్క్’ నుంచి నానా పటేకర్‌ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి ఆయన ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు కేసులో పేర్కొన్నారు. వార్త తెలిసిన వెంటనే బాంబోలిమ్‌లోని మణిపాల్ ఆస్పత్రిని సందర్శించిన పోలీసులు, అక్కడ మెడికల్ ఆఫీసర్‌తో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.

ఈ విచారణలో భాగంగా నానా పటేకర్ మరణానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పోస్టుమార్టం నివేదికను పరిశీలించడంతో పాటు, కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి వాంగ్మూలాలను సేకరించనున్నారు. ఒకవేళ ఈ విచారణలో ఆయనది సహజ మరణమేనని తేలితే కేసును ముగించే అవకాశం ఉంది. అలా కాకుండా ఏమైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నట్లు తేలితే మాత్రం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. గురువారం ఉదయం మీడియాకు వివరాలు వెల్లడించిన మణిపాల్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శేఖర్ సాల్కర్, తమ వైద్యుల బృందం ఆయనను కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే ఆయన కన్నుమూశారని, దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని, అయితే దానికి గల కచ్చితమైన కారణం తెలియనప్పటికీ, అంతకుముందే ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్నట్లు తమకు తెలిసిందని డాక్టర్ వెల్లడించారు. అనంతరం భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం అంత్యక్రియలు పూర్తయ్యాయి.