Reading Time: < 1 minute
Pakistan Jets Strike Houthis Mecca Pact Activated 8000 Troops In Saudi Arabia

Mecca Pact:  యెమెన్‌లోని హైతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చుక్కలు చూపిస్తున్నారు. వరసగా సౌదీ ఎయిర్‌పోర్టులు, సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, ‘‘మక్కా రక్షణ ఒప్పందం’’లో భాగంగా సౌదీకి అండగా పాకిస్తాన్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు హౌతీ స్థావరాలపై దాడుల్లో పాల్గొన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, పాకిస్తాన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.

పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు హౌతీలపై జరుగుతున్న దాడుల్లో ఉపయోగించినట్లు నివేదికలు వెలువడ్డాయి. టర్కీ-సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య కుదిరిన ‘‘మక్కా రక్షణ ఒప్పందం’’ కింద సౌదీలో పాక్ తన బలగాలను మోహరించినట్లు పాక్ సైన్యం ధ్రువీకరించింది. అయితే, బలగాలు సంఖ్య, వాటి సామర్థ్యాలపై వివరాలను వెల్లడించలేదు. సౌదీలో సుమారు 8000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మోహరించినట్లు న్యూయార్క్ టైమ్స్ చెప్పింది. ఇందులో పాక్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సిబ్బంది ఉన్నట్లు అంచనా వేశారు. కీలక చమురు మౌలిక వసతుల రక్షణలో వీరిని ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే టర్కీ మాత్రం సౌదీకి తమ సైన్యాన్ని పంపించే విషయంలో సుముఖంగా లేదని తెలుస్తోంది. హౌతీల దాడుల నుంచి సౌదీని ఎలా రక్షించాలనే దానిపై తమ దేశం ఎలా సహకరించాలో పరిశీలిస్తోందని టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ తెలిపారు. మక్కా ఒప్పందం రక్షణాత్మకమైనదే కానీ దాడులకు సంబంధించింది కాదు అని ఆయన స్పష్టం చేశారు. టర్కీ ప్రస్తుతం ఎయిర్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, సాంకేతిక సహాయం అందించే విషయంపై ఆలోచిస్తోంది.