Reading Time: 2 minutes

ఇండియాకు రియల్ బాస్ అంబానీనా అంటూ మస్క్ ట్వీట్.. రాహుల్ గాంధీ సంచలన రిప్లై!

Caption of Image.

స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతి ఆలస్యం అవుతోందని ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తూ, అంబానీనే భారత్‌కు అసలు బాస్‌నా? అని ప్రశ్నించడం సంచలనంగా మారింది.  2026 అక్టోబర్ 8న మస్క్ చేసిన ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో మస్క్ ట్వీట్ కు  రాహుల్ గాంధీ ఇచ్చిన రిప్లై మరో డిబేట్ కు దారితీసింది.  

మస్క్ తన ఎక్స్ పోస్టులో స్టార్‌లింక్ 165కి పైగా దేశాల్లో లైసెన్స్ పొందింది. ఇండియాలో అన్ని నిబంధనలను ఐదేళ్లుగా పాటించాం. అయినా ఇంకా అనుమతి ఎందుకు రావడం లేదు? అంబానీనే భారత్‌కు రియల్ బాస్‌నా? అని రాశారు. ఇంతకుముందు కూడా కొందరు ఒలిగార్చ్‌లు తమ మోనోపలీని కాపాడుకోవడానికి స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.

దీనికి స్పందిస్తూ రాహుల్ గాంధీ.. వెల్కమ్ టు ఇండియా, ఎలాన్. వెయిట్ టిల్ యూ డిస్కవర్ ది అదర్ గై అని పోస్ట్ చేశారు. ఆయన ఎవరి పేరు తీసుకోలేదు కానీ, కాంగ్రెస్ పార్టీ తరచూ గౌతమ్ అదానీని ప్రభుత్వానికి దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తిగా విమర్శిస్తూ వస్తుంటుంది కావునా.. ఆయననే ఉద్దేశించి రాహుల్ రిప్లై ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు.

రాహుల్ ట్వీట్ కు మస్క్ వెంటనే.. థ్యాంక్ యూ రాహుల్. దిస్ ఇస్ ఇండీడ్ ట్రబులింగ్ అని సమాధానం ఇచ్చారు.

ప్రభుత్వం మాత్రం మస్క్ ఆరోపణలను కొట్టిపారేసింది. అనుమతి విషయంలో ఎలాంటి  వివక్ష లేదని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ చెప్పింది.  స్టార్‌లింక్, రిలయన్స్  జియో సాట్‌కామ్, భార్తి-బ్యాక్డ్ యూటెల్‌సాట్ వన్‌వెబ్ అనే మూడు కంపెనీలకు లైసెన్స్ ఇచ్చారు. అయితే సెక్యూరిటీ క్లియరెన్స్‌లు, స్పెక్ట్రమ్ సంబంధిత అనుమతులు పూర్తయ్యాకే వాణిజ్య సేవలు ప్రారంభించవచ్చు అని పేర్కొంది.

స్టార్‌లింక్ భారత్‌లో మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించగలదని మస్క్ పలుమార్లు చెప్పారు. కానీ ప్రస్తుతం అనుమతులు ఆలస్యం కావడంతో ఈ విషయం రాజకీయ చర్చగా మారింది.

©️ VIL Media Pvt Ltd.