Reading Time: < 1 minute

బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? ఈ స్పెషల్ ట్రైన్స్ మీకోసమే !

Caption of Image.
  • నేటి నుంచి హైదరాబాద్, కాగజ్​నగర్​మీదుగా రాకపోకలు 

కోల్​బెల్ట్, వెలుగు : బతుకమ్మ, దసరా పండుగులను పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే 34 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది. సికింద్రాబాద్–-సిర్పూర్ కాగజ్​నగర్–-హైదరాబాద్ మధ్య ఈనెల 9 నుంచి 25 వరకు 17 రోజుల పాటు ప్రతిరోజూ వీటిని నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు సికింద్రాబాద్​లో బయలుదేరిన ప్రత్యేక రైలు( ట్రైన్​ నెంబర్​ 07711) సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్​ కాగజ్​నగర్​చేరుకుంటుంది.

సాయంత్రం 6 గంటలకు సిర్పూర్​ కాగజ్​నగర్​లో బయలుదేరే ప్రత్యేక రైలు(ట్రైన్​ నెంబర్​ 07712) రాత్రి ​ 11.15 గంటలకు కు హైదరాబాద్​ చేరుకుంటుందని రైల్వే ఆఫీసర్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్​ రోడ్ రైల్వే​ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. ఎసీ చైర్​కార్, సెకండ్​సిట్టింగ్​క్లాస్​ కోచ్​లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.