
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2026 అక్టోబర్ 8న ఢిల్లీలోని మోట్స్ హోటల్ లో కూటమి నేతలు కీలక భేటీ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ అధ్యక్షతన ఇండియా కూటమి నేతల సమావేశం అయ్యారు. లంచ్ మీటింగ్ తర్వాత కార్యాచరణ ప్రకటించనున్నారు.
కూటమి కూటమి నేతల ఆందోళనలు దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ ఢిల్లీలో భారీగా పోలీసు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీటింగ్ కు వెళ్తున్న సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుంది . దీంతో మోట్స్ హోటల్ కు నడుచుకుంటూ వెళ్లారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ తో ఎంపీలు మల్లురవి, చామల, వంశీ కృష్ణ నడుచుకుంటూ మీటింగ్ కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.. పోలీసులతో పీఎం మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తప్పించుకోలేరని అన్నారు. ప్రతిపక్ష్ నేతలపై పోలీసుల దాడి శోచనీయమని.. హుల్, ప్రియాంక, ఖర్గేలపై దాడులు సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈసీని అడ్డుపెట్టుకుని గెలుస్తున్నారని.. ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ముందుందని హెచ్చరించారు.
ఓట్ల తొలగింపుతో లబ్దిపొందేది ఎవరో తేలాలని అన్నారు. ఈసీ వెనుక ఎవరున్నారో బయటపడాలని డిమాండ్ చేశారు. కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు.. ఓట్లను తొలగించి లబ్దిపొందుతున్నది ఎవరో బయటపడాలని అన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వరా అంటూ ఈసీని ప్రశ్నించారు. దేశంలో ఓటర్లను బీజేపీ రెండు రకాలుగా విభజిస్తోందని.. ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లుగా విభజిస్తున్నారని అన్నారు. ఓటులేని వాళ్లంతా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలేనని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని తొలగిస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్.